హైదరాబాదీకి టికెట్ కొనిపెట్టిన సుష్మ - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాదీకి టికెట్ కొనిపెట్టిన సుష్మ

December 15, 2017

భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్  మరోసారి మంచిమనసు చాటుకున్నారు. శత్రు దేశం అయిన పాక్ ఆమెను విమర్శించినప్పటికి కూడా ఆ దేశ ప్రజలకు ఏదైనా వీసా సమస్య ఉంటే వెంటనే  స్పందించి పరిష్కరిస్తారు. తాజాగా సుష్మాజీ  పాక్‌లో ఉన్న భారతీయురాలిని భారత్‌కు రప్పించేందుకు వీసా మంజూరు చేశారు. తనకు టికెట్ కొనుక్కునేందుకు  డబ్బు లేేవని చెబితే స్వయంగా సుష్మ ఆమెకు టికెట్ కూడా ఏర్పాటు చేశారు.

హైదరాబాద్‌కు చెందిన మెుహమ్మదీ బేగం పాకిస్థాన్‌లో ఉంటోంది. ఆమెను తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో పాకిస్థాన్‌కు చెందిన యూనిస్ అనే వ్యక్తి 1996లో పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి  తల్లిదండ్రులతో మాట్లాడనీయకుండా చిత్రహింసలకు గురి చేస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న బేగం తండ్రి అక్బర్  విషయాన్ని ఈ ఏడాదిలో సుష్మ దృష్టికి తీసుకెళ్లాడు.

దీని‌పై స్పందించిన ఆమె బేగంను భారత్‌కు తిరిగి  తీసుకు వచ్చేందుకు  గత నెలలో వీసా మంజారు చేశారు. కానీ ఆమె పాక్ నుంచి వచ్చేందుకు డబ్బులు లేవని తండ్రి అక్బర్ మరోసారి సుష్మకు  తెలిపి సాయం కోరాడు. దాంతో బేగం రావడానికి టికెట్ కూడా ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని సుష్మ తన ట్విట ద్వారా తెలిపారు.

‘ఆమె భారతీయ పుత్రిక .పాక్ నుంచి ఆమె రావడానికి టికెట్ సమస్య వచ్చింది. మేం బేగంకు టికెట్ ఏర్పాటు చేస్తాం’ అని సుష్మ తెలిపారు.