సుస్మితా సేన్ పెళ్లి.. ఆమెకు 42, అతనికి 28 - MicTv.in - Telugu News
mictv telugu

సుస్మితా సేన్ పెళ్లి.. ఆమెకు 42, అతనికి 28

November 8, 2018

పెళ్లిలోని మహిమ అదే. ముహూర్తం ఎప్పుడెలా తన్నుకొస్తుందో తెలీదు. పెళ్లి, సంసారం వంటి లంపటాలు ఎందుకని ఒంటరిగా బతికేస్తున్న బ్రహ్మచారులు, చారిణులు టక్కున పెళ్లాడేసి కిలకిలా నవ్వుతూ ఫొటోలు దిగిస్తారు. మాజీ ప్రపంచ సుందరి ప్రియాంకా చోప్రా పెళ్ళికి సిద్ధమైన నేపథ్యంలో మరో మోస్ట్ ఎలిజిబుల్ బ్రహ్మచారిణి కూడా కల్యాణం బాట పట్టనుంది. మాజీ విశ్వసుందరి, బాలీవుడ్ సీనియర్ తారామణి సుస్మితా సేన్ కూడా త్వరలో పెళ్లికూతురు కానుంది. ఆమె తన బాయ్ ఫ్రెండ్ రోహ్మాన్ షాల్ ను పెళ్లాడబోతోంది. విషయం చెప్పకుండా ఫొటోలతో ఆమె ఇప్పటికే ప్రచారం మొదలెట్టేసింది.

View this post on Instagram

#duggadugga ❤️

A post shared by Sushmita Sen (@sushmitasen47) on

ప్రియుడితో, తన పిల్లలతో కలసి దీపావళి వేడుకులు జరపుకుంటున్న ఫొటోలను సోషల్ మీడియా ముఖాన కొట్టేసింది. 22 ఏళ్ల సుస్మిత కొన్నాళ్లుగా మోడల్ రోహ్మాన్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. తనకంటే దాదాపు 15 ఏళ్లు చిన్నవాడైన రోహ్మాన్ ఆమెకు అన్ని విధాలా నచ్చాడంట. తన దత్తత పిల్లల గురించి, ఆలోచనల గురించి ఆమె రోహ్మాన్‌కు చెప్పిందని, పెళ్లికి తనకు అభ్యంతరం లేదని అతడు అన్నాడని సన్నిహిత వర్గాలు చెప్పాయి. వచ్చే ఏడాదిలో పెళ్లి ముహూర్తం ఉంటుందన్నాయి.

Telugu news Sushmita Sen confirmed her marriage talks with photos from her celebration of Choti Diwali with her family accompanied by her boyfriend Rohman Shawl.