mictv telugu

అనుమానం.. కన్నవాళ్ళను చంపి, పిల్లలను అనాథలను చేసింది

January 11, 2019

పిల్లల బాధ్యత తల్లిదండ్రులదే. భార్యాభర్తల నడుమ ఎన్నున్నా వాటిని పిల్లల కోసమైనా సత్వరమే కూర్చుని మాట్లాడకోవాలి. సమస్యను పరిష్కరించుకుని పిల్లల భవిష్యత్తుకై పెద్దవాళ్లు బతకాలి. తల్లిదండ్రులు పోతే పిల్లల భవిష్యత్తు అంధకారమే అవుతుంది. కానీ కొందరు అనవసర అనుమానాలు, పంతాలు పట్టింపులకు పోయి, దారుణాలకు పాల్పడి పిల్లలను అనాథలను చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ భర్త భార్యపై అనుమానంతో ఆమెను దారుణంగా నరికి చంపాడు. అనంతరం అతనూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో వారి పిల్లలిద్దరూ దిక్కులేని అనాథలయ్యారు. ఈ దారుణ ఘటన అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం వ్యాసపురం గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…  

Telugu news suspect of Hobgoblin... Killing the parents and making children orphans .

వ్యాసపురంలో నివాసముండే మరన్న, విశాల భార్యాభర్తలు. వీరికి ఏడాది కుమార్తె, ఐదు సంవత్సరాల కుమారుడు ఉన్నారు. మరన్నకు భార్య ప్రవర్తనపై అనుమానం ఉండేది. ఆమె వేరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని పీకల్లోతు అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో ప్రతిరోజూ ఇద్దరిమధ్య గొడవలు జరుగుతుండేవి. శుక్రవారం అర్ధరాత్రి భార్యాభర్తల మధ్య గొడవ పెరిగిపోయింది. విచక్షణ కోల్పోయిన మరన్న గొడ్డలితో భార్య విశాలను దారుణంగా నరికి చంపాడు. అనంతరం గ్రామ సమీపంలోని పొలంలో చెట్టుకి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకేరోజు తల్లిదండ్రుల మరణంతో పిల్లలిద్దరూ అనాథలయ్యారు. ఏ పాపం తెలియని ఆ పసివాళ్ళను చూసి స్థానికులు కంటతడి పెట్టుకుంటున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Telugu news suspect of Hobgoblin... Killing the parents and making children orphans