సుజుకీ ఇంట్రూడర్.. ధర రూ. లక్ష - MicTv.in - Telugu News
mictv telugu

సుజుకీ ఇంట్రూడర్.. ధర రూ. లక్ష

October 31, 2017

సుజుకీ కంపెనీ వారంలో  రోజుల్లో సరికొత్త‘ ఇంట్రూడర్ 150’ బైక్‌ను లాంచ్ చేయనుంది.  ఇదే ఇంట్రూడర్ 150 బైక్ అని కొన్ని ఫోటోలు ఆన్ లైన్‌లో దర్శనమిస్తున్నాయి.

ఇది బజాజ్ అవెంజర్ 150ను పోలి ఉంది. ఇప్పటికే బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. దీని ధర రూ. లక్ష. లీక్ అయిన బ్రోచర్‌ను చూస్తుంటే  ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా  విడుదలైన ఇంట్రూడర్‌కు దీనికి చాలా దగ్గరి పొలికలు ఉన్నట్లు అనిపిస్తోంది.  ఇందులో ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ లైట్, ఎయిరో డైనమిక్ ఫ్యూయల్ ట్యాంక్,  ఎల్ఈడీటైల్ లైట్ ఉన్నాయి. 154.9 సింగిల్ ిలిండర్ యూనిట్, గిక్సర్ సిరీస్ , ఏబీఎస్ సేప్టీ ఫీచర్ ఉంది. ఈ బైక్ నవంబర్ 7న  ఇండియన్ మార్కెట్‌లోకి రానుంది.