ఎస్వీ కాలేజీలో మరో మెడికో ఆత్మహత్య.. కారణమేంటి..?

ప్రొఫెసర్ల వేధింపులతో జూనియర్ డాక్టర్ శిల్ప ఆత్మహత్య చేసుకున్న ఘటన మరువక ముందే మరో ఘటన చోటు చేసుకుంది. ఎస్వీ మెడికల్ కాలేజీలో మరో వైద్య విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. తిరుపతి శివ‌జ్యోతి‌నగర్‌కు చెందిన  గీతిక ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతోంది. ఆదివారం యూనివర్సిటీలోని తన రూంలో ఊరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన తోటి విద్యార్థులు ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయింది.

Sv university student committed suicide

ఎస్వీ మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్ల వేధింపుల కారణంగానే శిల్ప ఆత్మహత్య చేసుకుంది. దీంతో అప్పటి నుంచి ప్రొఫెసర్లపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ఇంతలోనే యూనివర్సిటీలో మరో మెడికో ఆత్మహత్య కలకలం రేపుతోంది.