మర్డర్ బాగోతం.. మటన్ సూప్‌  బయట పెట్టింది   - MicTv.in - Telugu News
mictv telugu

మర్డర్ బాగోతం.. మటన్ సూప్‌  బయట పెట్టింది  

December 12, 2017

నాగర్ కర్నూల్ కాంట్రాక్టర్ సుధాకర్ రెడ్డి హత్య కేసులో  మటన్ సూప్ కీలక ఆధారంగా మారింది. స్వాతి భర్తగా చలామణి అవుదామనుకుని  మొఖంపై  తోలు ఊడిపోయేలా  క్రీములు పూసుకుని ఆసుపత్రిలో ఉన్న రాజేశ్ ను  మటన్ సూప్  పట్టించింది. అయితే  చనిపోయిన సుధాకరెడ్డి  మాంసాహారి, కానీ  రాజేశ్ శాఖాహారి.  రాజేశ్ ను సుధాకర్ అనుకున్న సుధాకర్ కుటుంబసభ్యులు అతనికి  బలం రావాలాని  ఆసుపత్రిలో మటన్ సూప్ ను తాగించబోయారు. కానీ రాజేశ్  వద్దు అని వారించడంతో …అతను సుధాకర్ కాదని  అనుమానం వచ్చింది. తమ అనుమానులకు మటన్ సూప్ మరింత తోడు కావడంతో , గాయాలతో ఉన్నది సుధాకర్ రెడ్డి కాదని కుటుంబ సభ్యులు నిర్థారించకున్నారు. వెంటనే నాగర్ కర్నూల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తమదైన విధానంలో విచారించగా అసలు విషయం బయటకు తెలిసింది. కేసు విచారణలో భాగంగా  రాజేశ్ ఆధార్ కార్డు వేలిముద్రలతో దొరికిపోయాడు.దీనితో సుధాకర్ ను హత్యచేసిన  స్వాతి ఆమె ప్రియుడు రాజేశ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.