mictv telugu

ఇక స్విగ్గీలోనూ కిరాణా సరుకులు

February 12, 2019

ఒకప్పుడు ఆకలేస్తే హోటళ్లు, రెస్టారెంట్ల‌కు పరుగులు పెట్టిన జనం.. ఇప్పుడు స్విగ్గీ, జొమాటో, ఫుడ్‌పాండా వంటి యాప్‌ ల వైపు చూస్తున్నారు. ఇలా అందుబాటులోకి వచ్చిన కొద్దిరోజులకే ఈ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ కస్టమర్ల నుంచి ఎంతో ఆదరణ పొందాయి. తాజాగా ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ మరో అడుగు ముందుకేసింది. ఇకపై కస్టమర్లకు కిరాణా సరుకులను కూడా డెలివరీ చేయనుంది. ఈ మేరకు స్విగ్గీ మంగళవారం స్టోర్స్‌ను కూడా ప్రారంభించింది.Telugu News Swiggy Start Online Delivery Groceries In Gurgaonఈ యాప్‌లోకి యూజర్లు లాగిన్ అయి, ఇంట్లోంచే కావాల్సిన అన్ని సరుకులు ఆర్డర్ చేసుకోవచ్చు. ఇందుకోసం స్విగ్గీ సిటీల్లో ఉన్న అన్ని స్టోర్స్‌తో భాగస్వామ్యం అయింది. అయితే ప్రస్తుతం ఈ సౌకర్యం ఒక్క గుర్గావ్‌లో కస్టమర్లకు అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే దేశంలోని అన్ని నగరాలు,పట్టణాల్లోనూ ఈ సేలను ప్రారంభించనున్నారు. కిరాణా దుకాణాలు, సూపర్ మార్కెట్లు, పాన్ షాపులు, పెట్ కేర్ స్టోర్స్, ఫ్లోరిస్ట్స్, బేబీ కేర్ స్టోర్స్, ఆర్గానిక్ స్టోర్స్‌లో లభించే వస్తువులను స్విగ్గీ‌లో ఆర్డర్ చేసి ఇంటికే చెప్పించుకోవచ్చు.