రంగస్థలంపై కత్తి తీవ్ర విమర్శలు - MicTv.in - Telugu News
mictv telugu

రంగస్థలంపై కత్తి తీవ్ర విమర్శలు

March 30, 2018

‘ రంగస్థలం ’ సినిమాకు అన్నీ వైపుల నుంచి మంచి స్పందన వస్తోంది. సుకుమార్ డైరెక్షన్‌లో రామ్ చరణ్, సమంత జంటగా నటించిన సినిమా రంగస్థలం. హిట్‌టాక్‌తో దూసుకుపోతున్న నేపథ్యంలో సినీ విమర్శకుడు కత్తి మహేశ్ తనదైన శైలిలో విమర్శించారు. ఓ వెబ్ ఛానల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.కత్తి మహేశ్ ఏమన్నారంటే..

 రంగస్థలం సినిమా కథ చాలా సార్లు విన్నట్టే, కన్నట్టే అనిపిస్తుంది. పెర్ఫార్మెన్స్ పరంగా బాగానే ఉంది అనిపించినప్పటికీ కథ ముతకవాసనలొస్తోంది.

 • సినిమా ఆరంభంలో వాయిస్ ఓవర్‌ చెప్పారు. వాయిస్ ఓవర్ ఎందుకు వాడతారో కూడా తెలుసుకోకుండా వాయిస్ ఓవర్ వాడేస్తే దాన్ని దర్శకత్వ  లోపం అనొచ్చు.
 • 80 దశకంలోని సినిమాను ఎందుకు తీయాలి ? ప్రస్తుత పరిస్థితులకు అనువుగా తీయొచ్చు కదా.
 • పాటలు బయట విన్నంతగా సినిమాలో అంతగా రంజింప చేయవు. దేవీశ్రీ ప్రసాద్ పాడకుండా వుండుంటే బాగుండేది. బహుశా అతను పాడటం తగ్గిస్తే బెటరేమో. మంచి పాటల్ని కూడా తన గొంతుతో చెడగొట్టాడనే చెప్పవచ్చు.
 • ఆశాజనకంగా, ఉత్తేజభరితంగా ఉండకపోవడం దీనికున్న పెద్ద మైనస్.
 • బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ బాగున్నాకథ అస్సలు బాగాలేదు. సాగదీతకు గురైన సినిమాగా రంగస్థలం మిగులుతుంది. అనసూయ తన వయసుకు తగ్గ పాత్రలో నటించింది.
 • మనసుకు హత్తుకోని ఈ సినిమా.. సాగదీతల మధ్య బోర్ కొట్టే విధంగానే ఉంటుంది.
 •  రామ్ చరణ్ నటన కాస్తో కూస్తో విభిన్నంగా వుందని చెప్పుకోవచ్చు.
 • సమంత, ఆది పినిశెట్టిల నటన ఆకట్టుకుంది.
 • రంజింప చేయని రంగస్థలంగా మిగిలిపోతుంది.
 •  కథా కథనాల వీక్‌నెస్, దర్శకత్వంలోని అతీగతి లేని తీరు, అలాగే నిడివి ఇవన్నీ కలగలుపుకుంటే అంతగా రంజింపజేయదు రంగస్థలం సినిమా.
 • సుకుమార్ దర్శకత్వం బాగున్నప్పటికీ కథాకథనాలు తనవే కాబట్టి బ్లేమ్ కూడా తనకే వెళుతుందని చెప్పుకోవాలి. ఏదో చేయబోయి.. ఏదో చేసేశాడా అనే ఒక సందిగ్ధత మనలో కూడా ఏర్పడుతుంది.