ఈ చిన్నారి  వల్లే ఆ గ్రామంలో మరుగుదొడ్ల నిర్మాణం జరిగింది. - MicTv.in - Telugu News
mictv telugu

ఈ చిన్నారి  వల్లే ఆ గ్రామంలో మరుగుదొడ్ల నిర్మాణం జరిగింది.

March 24, 2018

అదో దట్టమైన అటవీప్రాంతం . అంతేకాక మూడువైపులా  కిలోమీలర్ల నీరు వ్యాపించి ఉంటుంది. కనీస సౌకర్యాలు కూడా ఉండని ఆ గ్రామంలో ఇప్పుడిప్పుడే విద్యుత్త్  స్తంభాలను ఏర్పాటు చేస్తున్నారు. అలాంటి గ్రామంలో 11 ఏళ్ల చిన్నారి సాక్షి యాదవ్ అందరికి ఆదర్శంగా నిలిచింది. పట్టుదలతో గ్రామాన్ని బహిరంగ మూత్ర విసర్జన రహిత గ్రామంగా తీర్చిదిద్దింది.

ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ పరిధిలోని మిఢకీలో చోటుచేసుకుంది. ఇది ముంపు గ్రామం కావడంతో చాలామంది ఇక్కడినుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లి పోయారు. కేవలం 10 కుటుంబాలకు చెందిన 55 మంది ఇక్కడ జీవనం కొనసాగిస్తున్నారు. వీరు చేపలు పట్టడం ద్వారా వచ్చే ఆదాయంతో జీవిస్తున్నారు. 7 వ తరగతి చదువుతున్న సాక్షి పంచాయతీ సభ్యుల్లో అవగాహన కల్పించి, గ్రామంలోని అందరి ఇళ్లలో వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మింపజేసి ,అందరి చేత ప్రసంశలు అందుకుంటోంది. చిన్న వయసులో ఇంత పరిపక్వంగా ఆలోచించి గ్రామ దిశను మార్చిన చిన్నారి సాక్షిని చాలా మంది మెచ్చుకుంటున్నారు