తాజ్‌మహల్‌ను దేశద్రోహులు కట్టారు - MicTv.in - Telugu News
mictv telugu

తాజ్‌మహల్‌ను దేశద్రోహులు కట్టారు

October 16, 2017

అందాల ప్రేమ మందిరం తాజ్‌మహల్‌ను దేశ ద్రోహులు కట్టారట. ఈ మాటన్నది ఎవరో కాదు ఉత్తరప్రదేశ్ బిజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్. ‘మొగల్ చరిత్రకు తాజ్‌మహల్ ఓ తార్కాణం, ఇదో అద్భుతమైన కట్టడం అని అందరు అంటారు. కానీ  తాజ్‌మహల్‌ను కట్టించిన షాజహాన్ తన తండ్రినే జైల్లో పెట్టాడు, తాజ్‌మహల్‌ను కట్టిన వాళ్లను చంపాలని చూశాడు. కనుక తాజ్‌మహల్‌ను కట్టింది దేశద్రోహులే, తాజ్‌మహల్‌ భారతీయ సంస్కృతిపై ఓ మాయని మచ్చ’ అని సంగీత్ సోమ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు. దీనిపై వివిధ రాజకీయ పార్టీలు మండిపడ్డాయి.

ఎర్రకోట సంగతో..

ఎమ్మెల్యే మాటలపై ఎంఐఎం అధినేత అజరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ  ఎర్రకోటను కూడా దేశ ద్రోహులే నిర్మించారని, మరి ఆ కోటపై జెండా ఎగురవేయకుండా ప్రధాని నరేంద్రమోదీ ఉంటారా అని ఆయన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు. అంతేకాదు తాజ్‌మహల్‌ను చూడొద్దని పర్యాటకులకు మోదీ, యోగి చెప్పగలరా అని కూడా ప్రశ్నించారు. అయితే తాజ్‌మహల్‌పై ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమే కాని దానితో ప్రభుత్వానికి ఏం సంబంధంలేదని యోగీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇటీవల యూపీ ప్రభుత్వం టూరిజం బుక్‌లెట్ నుంచి తాజ్‌మహల్‌ను తీసేసిన విషయం తెలిసిందే.