తాజ్‌మహల్‌ను షాజహన్ మాకు రాసిచ్చాడు.... - MicTv.in - Telugu News
mictv telugu

తాజ్‌మహల్‌ను షాజహన్ మాకు రాసిచ్చాడు….

April 11, 2018

ప్రఖ్యాత కట్టడం తాజ్ మహల‌్‌ మీద ఈమధ్య అనేక దూమారాలు రేగుతున్న విషయం తెలిసిందే.  తాజాగా తాజ్ మహల్‌ను మొఘల్ చక్రవర్తి షాజహన్ తమకు రాసిచ్చాడని,ఉత్తరప్రదేశ్ వక్ఫ్ బోర్డు సుప్రింకోర్టుకు విన్నవించింది. గత కొన్నాళ్లగా ఆర్కియాలజీ సర్వే ఇండియా(ఏఎస్ఐ) సున్నీ వక్ఫ్ బోర్డుతో  పోరాడుతోంది. 2010లో వక్స్ బోర్డు వాదనను వ్యతిరేకిస్తూ ఏఎస్ఐ సుప్రింకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన సుప్రింకోర్టు తాజ్ మహల్‌కు సంబంధించిన ఆధారాలను వక్ఫ్ ఆదేశించింది.  మొఘల్ చక్రవర్తి తాజ్ మహల్‌ను రాసిచ్చినట్టుగా చెబుతున్న డాక్యుమెంట్స్ కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది.షాజహన్ చేసిన డిక్లరేషన్  కాకుండా వేరే ఆధారాలు ఉన్నా కోర్టుకు ముందుగానే సమర్పించాలని సున్నీ బోర్డుకు సుప్రింకోర్టు సూచించింది.అందుకోసం వారం రోజులు గడువును  ఇచ్చింది. తాజ్ మహల్ మాదే అన్న వాదనపై ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ మాటను భారత్‌లో ఎవరైనా నమ్ముతారా?, అవనవసరంగా కోర్టు సమయాన్ని వృథా చేయరాదు.. అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు.

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన అనంతరం దేశ సంస్కృతిని తెలియజెప్పే అనేక కట్టడాలను కాపాడే బాధ్యతను ఆర్కియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా పరిధిలో వుంటాయి. అలాగే ముస్లిం మతానికి చెందిన ఆస్తులు, భూములు, స్వచ్ఛంద కార్యక్రమాలు, వైద్యం వంటివన్నీ వక్ఫ్‌బోర్డ్ పరిధిలో వుంటాయన్న విషయం తెలిసిందే. వాటిని తోసిపుచ్చుతూ యూపీ వక్ఫ్‌బోర్డు ఇలా సుప్రీంకోర్టును ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది.