సినిమా తీయండి అంతకు మించీ.. రివ్యూ రాయండి అప్పుడొచ్చీ.. - MicTv.in - Telugu News
mictv telugu

సినిమా తీయండి అంతకు మించీ.. రివ్యూ రాయండి అప్పుడొచ్చీ..

February 2, 2018

రిజెక్ట్ రివ్యూలు.. సేవ్ సినిమా అంటున్నాడు జబర్దస్త్ హైపర్ ఆది. రివ్యూలు రాసేవాళ్ళు సినిమాలు తీసి అవి విజయవంతమయ్యాక రివ్యూలు రాయాలని తన ట్విటర్ వేదికగా సినీ విమర్శకుడు కత్తి మహేష్‌కు సవాల్ విసిరాడు. రవితేజ నటించిన ‘ టచ్ చేసి చూడు ’ సినిమాకు కత్తి మహేష్ ఓ ప్రైవేట్ టీవీ ఛానల్లో యావరేజ్ రొటీన్ సినిమా అని రివ్యూ ఇచ్చాడు.

దానికి కౌంటర్‌గా ఆది స్పందిస్తూ పై విధంగా స్పందించాడు. రవితేజకు ఎవరి రివ్యూలు పట్టించుకోవద్దు.. కంగ్రాట్స్ రవితేజగారూ.. అని శుభాకాంక్షలు చెప్పాడు. కాగా సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో ఈ సినిమా గురించి మిశ్రమ స్పందనే వచ్చింది. రేటింగ్‌లు పెద్దగా రాలేవు. సినిమా బాగుంటే బాగుందని, బాగలేకపోతే బాగలేదని సామాన్య జనాలు కూడా అంటున్నారు.. మరి వాళ్ళందరికి హైపర్ ఆది ఏ విధంగా సమాధానం చెప్తాడనే వాదనలు వినిపిస్తున్నాయి.