ముచ్చట విత్ నాని, బ్రహ్మాజీ - MicTv.in - Telugu News
mictv telugu

ముచ్చట విత్ నాని, బ్రహ్మాజీ

April 11, 2018

నటనకు సహజత్వాన్ని పులిమి సహజ నటుడిగా టాలీవుడ్‌లో దూసుకుపోతున్న యువ హీరో నాని. దర్శకుడు అవుదామని ఇండస్ట్రీకి వచ్చాడు. కానీ అనుకున్నది ఒకటి.. ఇక్కడ జరిగింది ఇంకొకటి. తనకు హీరో అవాలని రాసి పెట్టి వుంది కాబట్టి దర్శకుడు కాకుండా హీరో అయ్యాడు. మొత్తానికి తాను నమ్ముకున్న కళారంగంలో విజయవంతంగా ముందుకు దూసుకుపోతున్నాడు నాని. ‘ అష్టాచమ్మా ’ నుంచి ‘ కృష్ణార్జున యుద్ధం ’ వరకు నాని ప్రయాణం ఎన్ని మలుపులు తిరిగింది. అలాగే క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమా రంగంలోకి అడుగుపెట్టి హీరోగా, అనేక పాత్రల్లో అలరించిన నటుడు బ్రహ్మాజీ.

రవితేజకు సమానంగా కెరియర్ మొదలుపెట్టి పరిశ్రమలో తనదంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నాడు బ్రహ్మాజీ. ‘ సింధూరం ’ సినిమాలో హీరోగా నటించి మంచి మార్కులు పొందాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇద్దరివి ఒడవని ముచ్చట్లు ఎన్నో. చెప్పేకన్నా చూస్తే బాగుంటుందని మైక్ టీవీ వారిరువురితో ముచ్చట పెట్టింది. వాళ్ళ వాళ్ళ అనుభవాలు ఎన్నో పంచుకున్నారు. వాళ్ళ కలలు, గమ్యాలు, పడ్డ శ్రమ, నేర్చుకున్న పాఠాలు, ముందు ముందు భవిష్యత్తు ప్రణాళికలు, ప్రస్తుతం కెరియర్ గురించి, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, పర్సనల్ పర్సన్స్.., ఇలా ఎన్నెన్నో విషయాల గురించి మాట్లాడారు. మంగ్లీ వారిద్దరినీ నవ్విస్తూ మస్తు మస్తు ముచ్చట్లు చెప్పింది. మీరు కూడా ఒకసారి చూడండి. క్రింది లింకులో మొత్తం ఇంటర్వ్యూ చూసి మీ కామెంట్లు తెలపండి.