తమన్ స్వరాలకు యూత్ ఫిదా  - MicTv.in - Telugu News
mictv telugu

తమన్ స్వరాలకు యూత్ ఫిదా 

October 27, 2017

సంగీత దర్శకునిగా తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నాడు ఎస్.ఎస్. తమన్. వినసొంపైన బాణీలతో ముఖ్యంగా యూత్‌కు గాలం వేస్తున్నాడు.

‘సారొచ్చారొచ్చారు.. ’ ఈ ఒక్క పాట చాలు తమన్ యూత్ నాడి ఎలా పట్టుకున్నాడో అంచనా వెయ్యటానికి. ఈ మధ్యే విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతున్న ‘ రాజుగారి గది 2’ సినిమాకు తమన్ అందించిన నేపథ్య సంగీతం ఆ సినిమాకు పూవికి తావి అబ్బినట్లు అబ్బింది.  అలాగే ఈ మధ్యే వచ్చిన ‘మహానుభావుడు ’ సినిమా కూడా మ్యూజికల్ హిట్టుగా నిలిచింది. ఇది తమన్ మార్క్ సినిమా అంటున్నారు. అఖిల్, కిక్ 2, బాడీగార్డ్, వీడెవడు, గౌతమ్‌నంద వంటి ఎన్నో సినిమాలతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సంపాదించుకున్నాడు తమన్.  తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ ఇలా అన్ని భాషల్లో సుమారుగా 60 సినిమాల వరకు సంగీతం అందించి ప్రేక్షకులను అలరిస్తున్నాడు. తాజాగా  హిందీలో వచ్చిన ‘ గోల్‌మాల్ అగేన్ ’ సినిమాకు తమన్ అందించిన సంగీతం అద్భుతంగా వుందంటున్నారు బాలీవుడ్ సంగీత ప్రియులు.