గజ బాధితులకు ‘సర్కార్’ విజయ్ అండ - MicTv.in - Telugu News
mictv telugu

గజ బాధితులకు ‘సర్కార్’ విజయ్ అండ

November 20, 2018

గజ తుపాను  తమిళనాడు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తోంది. వేలాదిమంది నిరాశ్రయులు అయ్యారు. తమిళ సూపర్‌స్టార్ విజయ్  బాధితులకు బాసటగా నిలిచాడు. విజయ్‌కి తమిళనాడు అంతటా “విజయ్ మక్కల్ ఇయక్కం (విఎంఐ)” పేరిట అభిమాన సంఘాలున్నాయి. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలిగినా ఈ అభిమాన సంఘాలు ముందుకొచ్చి సహాయ కార్యక్రమాలు చేపడుతుంటాయి.Telugu News tamil actor vijay massive donation to gaja cyclone affected districtsతుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న అభిమాన సంఘాల అధ్యక్షులలో ఒక్కొక్కరి బ్యాంకు అకౌంట్‌‌లో 4.5 లక్షల రూపాయలను విజయ్ డిపాజిట్ చేశారు. బాధితులకు కావాల్సిన నిత్యావసరాలను అందించి బాసటగా నిలవాలని కోరాడు. సాక్షాత్తు అభిమాన నటుడి నుంచి నిధులు రావడంతో విజయ్ అభిమానులు చురుగ్గా సేవ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.