విశాల్ ‘అయోగ్య’ పోస్టర్‌పై వివాదం..  

సినిమాలు వివాదాలకు కేంద్ర బిందువులుగా మారుతున్నాయి. తమిళ యంగ్ స్టార్  విజయ్ ‘సర్కార్’ మూవీ ఒక వర్గంవారిని అవమాన పరిచే విధంగా ఉందని ఆరోపణలు వచ్చాయి. తాజాగా హీరో విశాల్ రెడ్డి కొత్త సినిమా ‘అయోగ్య’ పోస్టర్‌పై తమిళనాట వివాదం రాజుకుంటోంది. తెలుగులో ఘన విజయం సాధించిన టెంపర్ చిత్రాన్ని విశాల్ తమిళంలో ‘అయోగ్య’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా పోస్టర్‌ను సోమవారం చిత్ర బృందం విడుదల చేసింది. పోలీస్ జీపుపై కూర్చున్న విశాల్ చేతిలో బీరుబాటిల్ ఉండటంతో పలువురు మండిపడుతన్నారు.

సినీరంగంలో బాధ్యతాయుత పదవుల్లో ఉంటూ, సమాజానికి నీతులు బోధిస్తున్న హీరో ఇటువంటి దురలవాట్ల సన్నివేశాల్లో నటించడం సరికాదని  పలువురు విమర్శిస్తున్నారు. సినిమావాళ్లు డబ్బు కోసం ఏ పనైనా చేస్తారని విశాల్ నిరూపించాడని అంటున్నారు. పీఎంకే పార్టీ వ్యవస్థాపకుడు రాందాస్ విశాల్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో సినిమాల్లో తారలు పొగతాగటంపై రాద్దాంతం చేసి ఓ మేరకు విజయం సాధించారు రాందాస్. ఇప్పుడు మద్యం విషయంలో విశాల్‌పై తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇప్పుడు ఈ వివాదం తమిళ చిత్రసీమలో హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై హీరో విశాల్ ఎలా స్పందిస్తారో వేచిచూడాలి.

Telugu News Tamil Hero Vishal New Movie Ayogya Controversy.. Temper Telugu Movie Remake Into Tamil