పోలీసు స్టేషన్ ముందే ఎస్ఐ సూసైడ్... - MicTv.in - Telugu News
mictv telugu

పోలీసు స్టేషన్ ముందే ఎస్ఐ సూసైడ్…

March 8, 2018

పోలీసు యంత్రాంగాన్ని కలవర పెట్టే   మరో ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. చెన్నైలోని టీపీ చత్రం పోలీసు స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న  ఎస్ఐ సతీష్ కుమార్ పోలీసు స్టేషన్ ముందే తుపాకీతో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసు స్టేషన్‌కు వెళ్లిన సతీష్  తన సహచర ఉద్యోగి అయిన చిరంజీవిని తన తుపాకి కావాలని అడిగాడు . ఆ తర్వాత ఓ తెల్లకాగితం అడిగి దాని మీద తన చావుకు కారణం ఎవరు కాదని రాసి ,స్టేషన్ గుమ్మం ముందే తుపాకీతో కాల్చుకుని మరణించాడు. సతీష్‌కు పని భారం ఎక్కువ అవ్వడం వలన మరణించాడని ఆరోపణలు వస్తున్నాయి. తన సహచర ఉద్యోగి అయిన చిరంజీవితో పనిభారం ఎక్కువైపోతోంది.. దానికంటే చావడం మేలు అని చెప్పాడని తెలుస్తోంది.సతీష్‌కుమార్‌ మరణంపై ఆయన తండ్రి రాజారాం మాట్లాడుతూ.. పనిభారం ఎక్కువగానే ఉందని చెప్పేవాడు. తన కొడుకును వేధించినవారిని  విచారించి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇదే స్టేషన్‌కు బాస్‌గా ఉన్న ఉన్నతాధికారి వేధింపులు ఐనావరంలో మరీ ఎక్కువేనన్న ఆరోపణలు ఉన్నాయి. ఈయన గతంలో ఓ స్టేషన్‌లో ఉండగా ఓ సిబ్బంది ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మరో మహిళా సిబ్బంది ఆత్మహత్య చేసుకోబోతున్నట్టు వాట్సాప్‌ వీడియో ద్వారా కలకలం రేపారు.