అక్రమ సంబంధం నేరం కాదని సుప్రీ కోర్టు ఇచ్చిన తీర్పుతో ఓ వ్యక్తి రెచ్చిపోయాడు. కోర్టే తీర్పు ఇచ్చింది, ఇక నాకు అడ్డెవరంటూ అక్రమ సంబంధాన్ని దర్జాగా కొనసాగించడం మొదలుపెట్టాడు. వద్దని భార్య ఎంత బతిమిలాడిన వినలేదు, కేసు పెడతానని బెదిరించినా లొంగలేదు. ఏం చేసుకుంటావో చేసుకో, దిక్కున్న చోట చెప్పుకోమన్నాడు. భర్త తీరుతో తీవ్ర మనస్థాపానికి గురైన భార్య ఆత్మహత్య చేసుకుంది. చెన్నై ఎంజీఆర్నగర్లో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది.
పుష్పలత(24) జాన్ ఫ్రాంక్లిన్ను రెండేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకుంది. జాన్ గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ పార్క్లో వాచ్మేన్గా పనిచేస్తున్నాడు. వీరికి ఏడాదిన్నర పాప ఉంది. కొద్ది రోజుల క్రితం పుష్పలతకు అనారోగ్యం భారీన పడింది. దీంతో భర్త జాన్ ఫ్రాంక్లిన్ ఆమెను పట్టించుకోవడం మనేసి మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పుష్పలత భర్తను నిలదీసి, కేసు పెడతానని బెదిరించింది. దీనికి అతను ఏ మాత్రం భయపడలేదు. తనను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని, కోర్టే తీర్పు ఇచ్చిందని భార్యతో వారించాడు.
తన భర్త ఇక మారడు అనుకున్న పుష్పలత మనస్థాపానికి గురైంది. శనివారం రాత్రి ఊరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.