జయలలిత మేనకోడలు మిస్సింగ్ - MicTv.in - Telugu News
mictv telugu

జయలలిత మేనకోడలు మిస్సింగ్

October 31, 2017

తమిళనాడు దివంగత సీఎం జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ కనిపించడం లేదు. గత కొద్ది రోజుల నుంచి దీప. తన భర్త మాధవన్‌కు మధ్య రాజకీయంగా విబేదాలు రావడంతో ఆయనకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యలో ఆమె శుక్రవారం ఇంటి నుంచి వెళ్లిపోయింది.

దీపా డ్రైవర్ రాజా తనను చంపుతానని బెదిరిస్తున్నట్లు మాధవన్ గతవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీప పోలీసు స్టేషన్‌కు వెళ్లి తన భర్త చేసిన ఫిర్యాదు నిజం కాదని  వెల్లడించింది. ఈ ఘటన తర్వాత ఆమె ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్టు సమాచారం. గత నాలుగు రోజుల నుంచి ఆమె ఆచూకీ తెలియడంలేదు. జయ మరణంతో ఖాళీ అయిన ఆర్కే నగర్ అసెంబ్లీ  ఉపఎన్నికల్లో పోటీ చేస్తున్న దీప ఆదృశ్యంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె అనుచరులు కంగారు పడుతున్నారు. మరోపక్క శశికళ సోదరి కొడుకు దినకరన్ కూడా  అక్కడి నుంచే పోటీ చేస్తానని ప్రకటించాడు.