గవర్నర్లకే కుచ్చుటోపీ.. 10 కోట్లు మింగిన వ్యాపారి - MicTv.in - Telugu News
mictv telugu

గవర్నర్లకే కుచ్చుటోపీ.. 10 కోట్లు మింగిన వ్యాపారి

March 1, 2018

తమిళనాడు రాజ్‌భవన్‌కు  ఫర్నీచర్ వస్తువులను సరఫరా చేసినట్లు నకిలీ బిల్లులతో మోసం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.  మహమ్మద్ యూసఫ్ అనే ఫర్నీచర్ వ్యాపారి ఐదేళ్లపాటుగా ఫర్నీచర్  సరఫరా చేసినట్టు నకిలీ బిల్లులను చూపించి రూ. 10 కోట్లను గుటకాయ స్వాహా చేశాడు.

చెన్నై గిండిలోని గవర్నర్ నివాసానికి యూసఫ్ 15 ఏళ్లుగా  ఫర్నీచర్‌ను సరఫరా చేసి కోట్లు గడించాడు. ప్రస్తుత గవర్నర్ భన్వారీ లాల్ ఫురోహిత్ పదవీబాధ్యతలు స్వీకరించిన కొద్దిరోజులకే ఈ మోసం బయటపడింది. యూసఫ్ గత పదేళ్ల  నుంచి నాసిరకం ఫర్నీచర్ వస్తువులను సరఫరా చేశాడు.అంతేకాకుండా ఐదేళ్ల నుంచి ఏ వస్తువునూ సరఫరా చేయకుండానే చేసినట్టు తప్పుడు బిల్లులు చూపించి కోట్లు కొట్టేశాడు.

అతడి మోసం విచారణలో బయటపడిందని గవర్నర్ డిప్యూటీ కార్యదర్శి శౌరిరాజన్ చెన్నై మహనగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేసి విచారణ జరిపారు.ఈ విచారణలో దోషిగా యూసఫ్ తెలడంతో అతనిని పోలీసులు అరెస్టు చేసి మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచారు.