మంత్రిగారి ఎద్దు మృతి.. జల్లికట్టులో విషాదం - MicTv.in - Telugu News
mictv telugu

మంత్రిగారి ఎద్దు మృతి.. జల్లికట్టులో విషాదం

February 12, 2018

తమిళనాడు ప్రజలు సంప్రదాయబద్ధంగా  నిర్వహించే జల్లికట్టు ఆటలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రంకెలు వేస్తూ, పరిగెత్తులూ వచ్చిన ఎద్దు ఒక్కసారిగా సిమెంట్ దిమ్మకు ఢీ కొట్టుకుని అంతర్గత రక్తస్రావంతో మరణించింది. తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి విజయభాస్కర్ ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న ఆంబోతు అది. దాని పేరు కొంబస్.

ఎన్నో పందేల్లో గెలిచి  బహుమతులు కొట్టేసిన కొంబస్‌ను బరిలోకి వదలగానే  అది పరుగు పరుగున వెళ్లింది. దాని కొమ్మొకటి సిమెంట్ దిమ్మెకు బలంగా తాకింది. కొమ్ము విరిగి, మెదడు చిట్లిపోయింది. దాంతో అక్కడికక్కడే కిందపడిపోయిన ఆ ఎద్దు  ఇక పైకి కూాడా లేవలేదు. ఆ ఎద్దును కాపాడాలని చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. జల్లికట్టులో వీరమరణం పొందిన కొంబస్ అంత్యక్రియలు ఘనంగా జరుగ్గా.. వేలాది మంది పాల్గొన్నారు.