రెండాకుల గుర్తు పళని ,పన్నీరులకే - MicTv.in - Telugu News
mictv telugu

రెండాకుల గుర్తు పళని ,పన్నీరులకే

November 23, 2017

అన్నాడీఎంకే పార్టీ గుర్తుపై నెలకొన్న వివాదం ఎట్టకేలకు  తెరపడింది. రెండాకుల గుర్తు పళనీ-పన్నీర్ వర్గానికే చెందుతుందని  కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ విషయాన్ని గురువారం  తమ నిర్ణయాన్ని ప్రకటిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో శశికళ వర్గానికి మళ్లీ ఎదురు దెబ్బ తగలింది. జయలలిత మరణం తరువాత ఆమె సహాయకురాలు శశికళ నటరాజన్  సీఎం పదవి కోసం ప్రయత్నించడం, ఆమెపై పన్నీర్ సెల్వం తిరుగుబాటు చేసి ముఖ్యమంత్రి కావడం. అక్రమాస్తుల కేసులో శశికళ జైలుకు వెళ్లడం. పన్నీర్ పదవి నుంచి తప్పుకుని మళ్లీ పళనీ స్వామీ ముఖ్యమంత్రి కావడం జరిగింది. అప్పటి నుంచి పన్నీర్ వర్సెస్ పళని వర్సెస్ శశికళ దినకరన్ వర్గంతో పోటీతో  అన్నాడీఎంకేలో సంక్షోంభం ముదిరి తారా స్థాయికి చేరుకుంది. మరొవైపు ఆర్కే నగర్ ఉపఎన్నికలు దగ్గరపడుతుడంతో మూడు వర్గాలు ఈసీని ఆశ్రయించాయి.దానితో తాత్కాలికంగా రెండాకుల గుర్తును రద్దు చేసింది. తర్వాత పళని,పన్నీర్ వర్గాలు ఒకటవ్వడంతో  ఈ అంశంపై రెండు సార్లు విచారణ  జరిపిన ఎన్నికల సంఘం చివరకు పళని-పన్నీర్ వర్గానికే కేటాయించింది.