టికెట్ లేకుండా  వెయ్యిమంది ప్రయాణం   - MicTv.in - Telugu News
mictv telugu

టికెట్ లేకుండా  వెయ్యిమంది ప్రయాణం  

November 2, 2017

చాలా మంది టికెట్ లేకుండా రైలులో ప్రయాణిస్తుంటారు. దొరికితే  దొంగలం, లేకపోతే ఫ్రీగా ప్రయాణం చెయ్యచ్చు అనుకుంటారు. ఒకవేళ దొరికితే  ఎంతో కొంత జరిమానా కడుతుంటారు. అయితే తమిళనాడులో ఓ వెరైటీ సంఘటన జరిగింది.

తమిళనాడులోని రామేశ్వరం నుంచి మధురైకి వెళ్లే ప్యాసింజర్ రైళ్లో వెయ్యిమంది  టికెట్ తీసుకోకుండా ఉచితంగా ప్రయాణించారు. దీనికి కారణం ఏంటంటే  స్టేషన్లో టికెట్లు ఇచ్చే ఉద్యోగి సెలవులో ఉండడమే కారణం. ప్రయాణికులంతా టికెట్ కౌంటర్ దగ్గర చాలా సేపు వేచి చూశారు. ఎంతకీ టికెట్ల్ ఇచ్చే ఉద్యోగి రాకపోవడంతో, రైళు రాగానే వారంతా ఎంచక్కా రైళ్లో కూర్చొని ప్రయాణించారు. విధులకు హాజరు కాకుండా డుమ్మా కొట్టిన ఉద్యోగిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు.