తమిళనాడులో తెలుగు టెకీపై అత్యాచారం - MicTv.in - Telugu News
mictv telugu

తమిళనాడులో తెలుగు టెకీపై అత్యాచారం

February 16, 2018

తమిళనాడులో తెలుగు యువతిపై దారుణం జరిగింది. విజయవాడకు చెందిన  లత(పేరు మార్చాం) చెన్నైలోని ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. గురువారం రాత్రి తన విధులు ముగించుకుని తన రూమ్కు వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అంతంటితో ఆగకుండా ఆమె తలపై రాడ్డుతో కొట్టి ఆమె వద్ద డబ్బు, బ్యాగులను లాక్కుని పారిపోయారు. తీవ్ర గాయాలతో ఉన్న ఆమెను స్థానికులు తాంబరం ఆస్పత్రికి తరలించారు.అయితే పరిస్థితి విషమించడంతో వెంటనే గ్లోబల్ ఆస్పత్రికి తలరించి చికిత్స అందిస్తున్నారు.  పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.