mictv telugu

టిక్‌టాక్‌‌ను బ్యాన్ చెయ్యాల్సిందే.. తమిళనాడు సర్కార్ నిర్ణయం..

February 14, 2019

టిక్‌టాక్ ఇప్పుడు చాలా క్రేజులో వున్న యాప్ ఇది. తమలోని టాలెంటును నిరూనించుకోవడానికి చాలా మంది యువత టిక్‌టాక్ వీడియోలు చేస్తున్నారు. ఏం చేస్తున్నావు ఇప్పుడు అని అడిగితే టిక్‌టాక్ చేసుకుంటున్నా అని సమాధానం ఇస్తున్నారు. చాలా మంది చదువుకునే విద్యార్థులు టిక్ టాక్‌లో వీడియోలు చేస్తూ అప్ లోడ్ చేస్తున్నారు. అనతి కాలంలోనే దేశవ్యాప్తంగా ఈ చైనా బేస్డ్ టిక్‌టాక్ చాలా ప్రజాదరణ పొందింది. డైలాగ్స్, ఎమోషన్స్, సాంగ్స్ అన్ని ఉన్న ఈ యాప్ యువతను విపరీతంగా ఆకర్షిస్తోంది. అయితే ఈ యాప్ వల్ల ఎంత ఉపయోగం వుందో అంతకన్నా ఎక్కువగా నష్టం వుందని తమిళనాడు రాజకీయ నేతలు అంటున్నారు. ఈ యాప్‌ను వీలైనంత త్వరగా బ్యాన్ చేయాలని భావిస్తోంది తమిళనాడు ప్రభుత్వం.

ఈ యాప్ బ్లూవేల్ గేమ్ కన్నా ప్రమాదకరమైంది..

తమిళనాడు రాజకీయనాయకులు అందరూ ఈ యాప్‌ బ్లూవేల్‌ గేమ్‌ కన్నా ప్రమాదకరమైనదిగా అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఐటీ మంత్రి ఎం. మనికందన్‌ టిక్‌టాక్‌ యాప్‌ వల్ల తలెత్తుతున్న దుష్పరిణామాల గురించి అసెంబ్లీలో చర్చించారు. ‘ఈ యాప్ వాడకం వల్ల తమిళ సంస్కృతి నాశనం అవుతోంది. శాంతి భద్రతలు దెబ్బతినే ప్రమాదం వుంది. అసభ్యకర నృత్యాలకు, ఫోర్నోగ్రఫికి టిక్‌టాక్‌ వేదికగా మారింది. ఇలాంటివాటితో యువత తప్పుదోవ పడుతున్నారు. అమ్మాయిలు అబ్బాయిలు బూతులు మాట్లాడుకుంటున్నారు. దీనిని వెంటనే బ్యాన్ చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతాం’ అని మణికంఠన్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు.

Telugu news Tamil Nadu to ban TikTok app because users upload obscene videos on it.

కలెక్టర్ ఫోటోలు షేర్ చేశారు..

ఇటీవల తమిళనాడు రాష్ట్రం సేలం జిల్లా కలెక్టర్ రోహిణి పర్సనల్ ఫోటోలను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు సినిమా పాటలతో యాడ్ చేసి టిక్‌టాక్ యాప్‌లో పోస్టు చేశారు. అక్కడితో ఆగకుండా ఆ ఫోటోలు వివిధ సోషల్ మీడియా నెట్‌వర్క్‌లల్లో షేర్లు చేశారు. ఆ ఫోటోల్లో ఆమెతో పాటు ఆమె కుమారుడు కూడా వున్నాడు. దీంతో సదరు కలెక్టర్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం పోలీసులు ఆ ఫోటోలను తొలగించే పనిలోపడ్డారు. గతేడాది జనవరిలో కూడా నలుగురు యువకులు పోలీసులను అవమానిస్తూ ఓ ఫన్‌ వీడియోను రూపొందించి ఇబ్బందులకు గురయ్యారు. Telugu news Tamil Nadu to ban TikTok app because users upload obscene videos on it