కచేరీ చేసిన ఏనుగు - MicTv.in - Telugu News
mictv telugu

కచేరీ చేసిన ఏనుగు

February 19, 2018

కోతులు, రామచిలుకలు, మైనాలు వంటి  మూగజీవులకు మనం శిక్షణను ఇస్తే అవి ఏ పనులైన నేర్చుకుంటాయి. అచ్చం మనుషుల్లాగా అవి పనులు చేస్తుంటే మనకెంతో ఆశ్చర్యం, ఆనందం కలుగుతుంది.. తాజాగా తమిళనాడులోని కోయంబత్తూరులో ఆండాళ్  ఓ ఏనుగు మౌత్ ఆర్గాన్ వాయించి అందర్నీ ఆకట్టుకుంటోంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.కోయంబత్తూరులో ఏనుగుల సంరక్షణ కోసం ఓ భారీ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. జనవరి 4న ప్రారంభమైన  ఈ వైద్య శిబిరం ఈ నెల 20తో ముగుస్తుంది. ఏనుగుల ఆరోగ్యం కోసమే ప్రత్యేకంగా ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. గతేడాది నిర్వహించిన శిబిరంలో లక్ష్మి పేరున్న 11 ఏళ్ల ఏనుగు కూడా మౌత్ ఆర్గాన్ పరికరాన్ని వాయించి  అందరి చేత శభాష్ అనిపించుకుంది. ఆ ఏనుగు ఏడాది వయసున్నప్పటి నుంచే ఆ వాద్య పరికరాన్ని వాయిస్తుండటం విశేషం.