మాజీ సీఎం భార్యలకు జైలు శిక్ష - MicTv.in - Telugu News
mictv telugu

మాజీ సీఎం భార్యలకు జైలు శిక్ష

February 16, 2018

తప్పు చేసిన వారిని చట్టం ఎప్పటికైనా శిక్షిస్తుంది. మనదేశంలో ఈ ప్రక్రియ నత్తనడక నడుస్తున్నా.. దొంగలు చివరికి మాత్రం దొరికిపోతనూ ఉన్నారు. అక్రమాస్తుల కేసులో అన్నాడీఎంకే నేత, తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం ఇద్దరు భార్యలకు మద్రాస్ హైకోర్టు శిక్షను విధించింది. 1991-96 మధ్య అన్నాడీఎంకే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు  పన్నీర్ సెల్వం తన పలుకుబడిని ఉపయోగించి ఆదాయానికి మించి  రూ. 21లక్షలు విలువ చేసే ఆస్తులను సంపాందించినట్టు కేసు నమోదైంది.ఈ కేసుపై విచారణ జరిపిన చెన్నై ప్రత్యేక కోర్టు 2007లో పన్నీరు సెల్వంకు మూడు సంవత్సరాలు జైలు శిక్షను విధించింది.అలాగే తన  ఇద్దరు భార్యలకు ఏడాది పాటు శిక్షను విధించింది.ఈ తీర్పును సవాల్ చేస్తూ మద్రాస్ హైకోర్టులో అప్పీలు చేశారు. దీనిపై తాజాగా విచారణ జరిపిన హైకోర్టు పన్నీరు సెల్వం భార్యలకు  జైలు శిక్షలను ఖరారు చేసింది. మొదటి భార్య జానకి అమ్మాళ్, రెండో భార్య భాగ్యమ్మాళ్‌లను రెండు వారాల్లో  కోర్టులో లొంగిపొవాలని హైకోర్టు ఆదేశించింది. పన్నీర్ జైలు శిక్ష ఖరారుపై వాదనలు జరగనున్నాయి.