చచ్చిపోతా..అనుమతివ్వండి.. హిజ్రా ఆవేదన! - MicTv.in - Telugu News
mictv telugu

చచ్చిపోతా..అనుమతివ్వండి.. హిజ్రా ఆవేదన!

February 14, 2018

రాష్ట్రపతికి ఓ ట్రాన్స్ జెండర్ లేఖ రాసింది. అందులో తాను చనిపోవడానికి అనుమతి ఇవ్వాలని కోరింది. అధికారుల చుట్టు ఉద్యోగం కోసం కాళ్లు అరిగేలా తిరిగిన లాభం లేకుండా పోయింది. దాంతో ఆమె ఈ నిర్ణయం తీసుకుంది .ప్రస్తుతం ఈ వార్త హాట్ టాఫిక్ గా మారింది.

తమిళనాడులోని తిరుచ్చుందర్‌కు చెందిన పొన్ను స్వామి ఇంజినీరింగ్ చదివింది. తర్వాత ఓ ప్రైవేట్ కంపెనీతో పాటు, ఎయిర్ ఇండియా కస్టమర్ సపోర్ట్‌లో కూడా ఉద్యోగం చేసింది.  కాని ట్రాన్స్‌జెండర్ కావడంతో తన పరిస్థితిని అక్కడి హెచ్‌ఆర్ వాళ్లకు చెప్పారు. వారి సలహా, ప్రోత్సాహంతో 2014లో ఎస్‌ఆర్‌ఎస్ సర్జరీ చేయించుకుంది.

ఆ  తర్వాత శాన్వి పొన్నుస్వామిగా మారి… 2016లో ఎయిర్ ఇండియాలో క్యాబిన్ క్రూ ఉద్యోగానికి అప్లై చేసుకుంది.  ఆమెకు నాలుగు సార్లు కాల్ లెటర్ కూడా వచ్చింది. టెస్ట్‌లకు కూడా వెళ్లింది. ఇంటర్వ్యూ చేసిన వారి నుంచి కూడా ఆమెకు మద్దతు దొరికింది. కాని ఫైనల్ లిస్ట్‌లో మాత్రం పేరు రాలేదు. ఆమె నాలుగు సార్లు ఇలా షాకయ్యింది.

ఎందుకు  ఇలా తన పేరు లేదని ప్రశ్నించగా..ఎయిర్ ఇండియా నిబంధనల ప్రకారం కేవలం ఆడవాళ్లకు మాత్రమే ఆ ఉద్యోగంలో అవకాశం ఉంటుదని తెలిసింది. 2017లో తనకు జరిగిన అన్యాయాన్ని పౌరవిమానయానశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. అయిన కూడా ఫలితం లేకుండా పోయింది.  వెంటనే ఆమె ప్రధాని మోడీకి లేఖ రాసింది.  తనకు జరిగిన అన్యాయాన్ని ఆమె ప్రస్తావించింది.  అంతేకాదు సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా వేసింది. 2017 నవంబర్‌లో ఈ కేసుపై వెంటనే స్పందించాలని పౌరవిమానయానశాఖ అధికారులకు కోర్టు నోటీసులు కూడా ఇచ్చింది. అయినా కూడా ఇప్పటికీ అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

తనకు జరిగిన అన్యాయంపై ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.  సమాజంలో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాను, కోర్టు చుట్టూ తిరుగుతూ లాయర్లకు ఫీజులు చెల్లించలేక ఆర్థికంగా ఇబ్బందులు కూడా ఎదురయ్యాయి. అందుకే చనిపోవడానికి అనుమతి ఇవ్వాలని రాష్ట్రపతికి లేఖ రాసి కోరింది. తమలాంటి వారు ఇంకా ఎన్ని రోజులు ఇలాంటి కష్టాలు పడాలని ప్రశ్నించింది. తమ హక్కులకు భంగం కలుగుతుందని… ఉద్యోగాల్లో అవకాశాలు ఇవ్వాలని కోర్టులు గతంలో ఎన్నిసార్లు చెప్పినా న్యాయం జరగకపోవడం దారుణమని శాన్వి  ఆవేదన వ్యక్తం చేసింది.