మాజీ సీఎం పాత్రలో కట్టప్ప - MicTv.in - Telugu News
mictv telugu

మాజీ సీఎం పాత్రలో కట్టప్ప

October 24, 2017

ప్రముఖ నటుడు,తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి ఎంజీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా ఓ చిత్రాన్ని  తెరకెక్కించేందుకు   సన్నాహాలు చేస్తున్నారు.  ఈ చిత్రానికి సంబంధించిన పనులు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

 ‘బాహుబలి’  చిత్రాల్లో కట్టప్ప పాత్రలో ఒదిగిపోయి, ఆద్భుతంగా నటించిన సత్యరాజ్..  ఎంజీఆర్ పాత్రలో నటించబోతున్నాడని  కోలీవుడ్ సమాచారం.  ఈ చిత్రాన్ని  బాలకృష్ణ 102 సినిమాను నిర్మిస్తున్న రమణా కమ్యూనికేషన్  నిర్మాణ సంస్థ నిర్మించనుంది. ఈ సినిమాకు  సంబంధించిన మరిన్ని వివరాలను రమణ కమ్యూనికేషన్ బ్యానర్ లో త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.