అనిత కుటుంబానికి లారెన్స్ సాయం.... - MicTv.in - Telugu News
mictv telugu

అనిత కుటుంబానికి లారెన్స్ సాయం….

September 10, 2017

సినీ హీరో, డైరెక్టర్, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ మరోసారి తన సేవా గుణాన్ని చాటాడు.నీట్ పరీక్ష కారణంగాఆత్మహత్య చేసుకున్న అనిత కుంటుంబానికి ఆర్థికంగా సాయం చేశాడు. తమిళ నాడులోని కుజుమూర్ గ్రామానికి చెందిన అనిత(17) తనకి నీట్ పరీక్ష వలన ఎంబీబీఎస్ సీటు రాలేదని మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది.

పలువురు ప్రముఖులు అనిత ఆత్మకు శాంతి కలగాలని కోరగా, లారెన్స్ మాత్రం అనిత కుంటుంబానికి 15 లక్షల ఆర్థిక సాయం అందించి, అందరి మనస్సులను గెలుచుకున్నాడు. లారెన్స్ ఇటీవల చెన్నైన కుదిపేసిన వరద బాధితులకు కూడా సాయం చేశాడు.  ప్రస్తుతం లారెన్స్’ కాంచన 3′ మూవీలో నటిస్తున్నాడు.