జయలలితకు  కూతురు పుట్టింది నిజమే... - MicTv.in - Telugu News
mictv telugu

జయలలితకు  కూతురు పుట్టింది నిజమే…

November 29, 2017

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం తరువాత పలువురు తమ బిడ్డలమంటూ కోర్టును ఆశ్రయించి, భంగపడ్డారు. ఈ నేపథ్యంలో జయ మేనత్త కూతురు లలిత చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. జయలలితకు ఓ ఆడపిల్ల పుట్టిన మాట నిజమేనని ఆమె అన్నారు.

అయితే ఆ బిడ్డ ఎక్కడ పెరిగింది?ఎక్కడ ఉన్నది తమకు తెలియదని తెలిపారు. బెంగళూరుకు చెందిన ఆమృత అనే యువతి తాను జయలలిత కుమార్తెనని, కావాలంటే తనకు డీఎన్ఏ పరీక్షను నిర్వహించాలని సుప్రీం కోర్టును ఆశ్రయించగా ఆమె పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లలిత మీడియా ముందుకు వచ్చారు.

జయ తండ్రి జయరామన్ సోదరి జయశిఖ కుమార్తె లలిత బెంగళూరులో నివసిస్తున్నారు. ‘1980లో  చైన్నైలోని మైలాపూర్‌లో మా పెద్దమ్మనే జయలలితకు పురుడు పోశారు. జయ తల్లి సంధ్య మృతి చెందడంతో పెద్దమ్మ ప్రసవం చేశారు.

1970 నుంచి మా కుటుంబం జయ కుటుంబానికి  దురంగా ఉంది. కేవలం జయ ప్రసవం కోసమే పెద్దమ్మని పిలిపించారు. తనకు బిడ్డ పుట్టిందని ఎవరికీ చెప్పకూడదని పెద్దమ్మతో జయ ఒట్టేయించుకున్నారు.. ’ అని  లలిత చెప్పారు. సుప్రీం కోర్టు వెళ్లిన  ఆమృత జయ కూతురో కాదో డీఎన్ఏ పరీక్ష ద్వారానే తేలుతుందన్నారు.