ఈమె ఎవరు? జయా? శశికళా? పళనిస్వామి పెళ్లామా? - MicTv.in - Telugu News
mictv telugu

ఈమె ఎవరు? జయా? శశికళా? పళనిస్వామి పెళ్లామా?

February 26, 2018

తమిళనాడు రాజకీయాలు చిత్రంగా ఉంటాయి. నాస్తిక వాదం, ఆస్తిక వాదం పెనవేసుకుని ఉంటాయి. నేతలకు విగ్రహాలు, గుళ్లు కట్టడం కూడా ఎక్కువే. అలాంటి ఓ విగ్రహం వ్యహారం ఇప్పుడు రచ్చకెక్కింది. తమిళనాడు దివంగత సీఎం జయలలిత విగ్రహంపై వివాదం ముదిరింది.

చెన్నైలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో ఈ బొమ్మను ఏర్పాటు చేశారు.  ఆ విగ్రహంలో జయ రూపురేఖలు లేవని, ఆయన నెచ్చెలి శశికళ, ముఖ్యమంత్రి పళనిస్వామి భార్య రాధ, అన్నాడీఎంకే సీనియర్ నాయకురాలు వలర్మతిల రూపురేఖలు ఉన్నాయని తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. జయ అభిమానులు దీనిపై పట్టలేనంత కోపంతో ఉన్నారు.

పళనిస్వామి వంటి నేతలెందరినో పైకి తెచ్చిన అమ్మను ఇలా కించపరుస్తారనా అని అని భగ్గుమంటున్నారు.దీంతో అన్నాడీఎంకే నేతలు లెంపలు వేసుకున్నారు. విగ్రహంలో లోపాలు ఉన్నమాట వాస్తవమేనని , వీలైనంత త్వరగా విగ్రహంలో మార్పులు చేస్తామని పార్టీ నేత శశికళ బంధువు దినకరన్  తెలిపారు.