ఎమ్మెల్యే.. షాకింగ్  వీడియో వైరల్ - MicTv.in - Telugu News
mictv telugu

ఎమ్మెల్యే.. షాకింగ్  వీడియో వైరల్

December 4, 2017

అన్నాడీఎంకే ఎమ్మెల్యే మద్యం, డబ్బు పంచుతూ అడ్డంగా దొరికిపోయాడు. ఆ వీడియో వైరల్ కావడంతో దుమారం రేగింది. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి ఎంజీఆర్ జయంతి ఉత్సవాలను అన్నాడీఎంకే పార్టీ ఆదివారం ఘనంగా నిర్వహించింది. అందుకోసం ప్రజలను సమీకరించేందుకు ఎమ్మెల్యే కనకరాజ్ భారీగా మద్యం, డబ్బును పంచారు. 60 బస్సుల్లో ఆయన ప్రజలను సభకు తీసుకెళ్లారు.

దీనికి సంబంధించిన  ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కుర్చీలో కూర్చున్న ఎమ్మెల్యే పక్కన ఉన్న మరోవ్యక్తి 2 వేల రూపాయల నోట్ల కట్టలు పట్టుకుని రిజిస్ట్రర్‌లో రాసుకుంటూ ఉన్నాడు. పక్కనే మద్యం బాటిళ్లు ఉన్నాయి.

ఈ వీడియో వైరల్ కావడంతో విపక్షాలు ఎమ్మెల్యే కనకరాజ్, అన్నాడీఎంకే పార్టీపై మండిపడుతున్నాయి. ప్రజలను ప్రలోభపెట్టి ఇలాంటి పనులు  చేయడం ఎంతవరకు సమజసమంటున్నాయి.

అయితే ఈ ఆరోపణలను కనకరాజ్ ఖండిస్తున్నాడు. వేదికకు వచ్చే వారి సౌకర్యం కోసం తాను డబ్బును కేటాయించినట్టు తెలిపారు. తమిళ ప్రజలు డబ్బు, మద్యానికే తలోగ్గే రకం కాదని అన్నాడు. ఈ నెల 21 ఆర్కే నగర్ ఉపఎన్నిక  జరగనుంది. ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే పార్టీ విజయం తద్యమని కనకరాజ్ ఆశాభావం వ్యక్తం చేశాడు.  గతంలో కూడా ఆర్కే నగర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉండగా, డబ్బు, మద్యం,మిల్క్ టోకన్లు, ఫోన్ రీచార్జీ కూపన్లు, మెుబైల్ వాలెట్ పేమంట్లను  పలువురు నేతలు పంపిణి చేయడంతో ఎన్నిక రద్దైన సంగతి తెలిసిందే.