తండ్రిని ఎదిరించి మతాంతర పెళ్లి  చేసుకున్న యాంకర్ - MicTv.in - Telugu News
mictv telugu

తండ్రిని ఎదిరించి మతాంతర పెళ్లి  చేసుకున్న యాంకర్

December 7, 2017

ప్రముఖ తమిళ టీవీ యాంకర్ మణిమేఘలె  ప్రేమ వివాహం చేసుకుంది. ఆమె ఇస్లాం మతానికి  చెందిన హుస్సెన్ అనే యువకుడిని ప్రేమించింది. ఇద్దరి మతాలు వేరు కావడంతో మణి   తండ్రి పెళ్లికి నిరాకరించాడు. దాంతో ఆమె  ఇంట్లో నుంచి బయటకి వచ్చి బుధవారం రిజిస్టర్ మ్యారేజ్  చేసుకుంది.  అంతేకాకుండా సమాజానికి  ఓ మంచి సందేశం కూడా ఇచ్చింది. ‘ ప్రేమకు మతం లేదు’ అంటూ మణిమేఘాలె  ట్వీట్ చేస్తూ వారి పెళ్లి ఫోటోను పోస్ట్ చేసింది. అంతేకాక తాను  ఎందుకు  రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చిందో వివరణ  ఇచ్చింది..

‘హుస్సేన్ నేను ఈ రోజు పెళ్లి చేసుకున్నాం. అనుకోకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చింది. మా నాన్నను  ఒప్పించడానికి ప్రయత్నం చేసి వైఫల్యం చెందాను. దాంతోనే ఈ నిర్ణయం తీసుకుని ఇంటి నుంచి బయటకు వచ్చాను. ఏదో ఒక రోజు మా నాన్న నన్ను అర్థం చేసుకుంటారని నేను నమ్ముతున్నాను. ప్రేమకు మతం లేదు. ఐ లవ్ యు హుస్సేన్ . శ్రీ రామ జయం.. అల్లా’ అంటూ మణి ట్వీట్ చేసింది.