మహిళలను కాపాడలేని దేశం కూడా ఓ దేశమేనా ? - MicTv.in - Telugu News
mictv telugu

మహిళలను కాపాడలేని దేశం కూడా ఓ దేశమేనా ?

April 12, 2018

నటి తమన్నా మహిళలపై జరుగుతున్న వేధింపులపై చాలా ఘాటుగా ట్వీట్ చేసింది.  దేశంలో చిన్నారి బాలికలు,యువతులు,మహిళలపై జరుగుతున్న దాడులపై ఆవేదన వ్యక్తం చేసింది. జమ్మూకాశ్మీర్‌లో 8ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో 16ఏళ్ల యువతి అత్యాచారానికి గురైంది. ఆమెకు జరిగిన దారుణాన్ని నిరసిస్తూ.. న్యాయ పోరాటం చేస్తున్న క్రమంలో తన తండ్రిని కోల్పోయింది. ఈ దేశం ఎటు పోతోంది? సంస్కృరణలు  తెచ్చేందుకు ఇకెంతమంది నిర్భయలు ప్రాణత్యాగం చేయాలి. మహిళలను సురక్షితంగా ఉంచుకోలేని దేశం కూడా ఓ దేశమేనా? మానసిక వైకల్యంతో బాధపడుతున్న ఈ దేశానికి చికిత్స అవసరమని తెలిపింది.బాలీవుడ్ నటి రిచాచద్దా కూడా ఈ విషయంపై స్పందించింది. ‘ ప్రధానమంత్రి నరేంద్రమోదీ మహిళల కోసం ప్రవేశపెట్టిన పథకాలు‘బేటి బచావో’,బేటి  పడావో’ పథకాలు ఎందుకు పెట్టారు. వాటి పేర్లు మార్చండి . అత్యాచారం జరిగిన అమ్మాయి తండ్రిని జైలులో పెట్టి చంపారు. ఇదెక్కడి న్యాయం ’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.