నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి.. తమ్మారెడ్డి - MicTv.in - Telugu News
mictv telugu

నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి.. తమ్మారెడ్డి

April 19, 2018

నటి శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్‌పై చేసిన వాఖ్యలపై సినీ నిర్మాత ,దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ  స్పందించారు. శ్రీరెడ్డి‌కి మొదట సపోర్ట్ చేసింది తనేనని చెప్పారు. కానీ నోరు ఉందని ఎలా పడితే అలా మాట్లాడితే మంచిగా ఉండదని, నోరును ఆదుపులో పెట్టుకుని మాట్లాడాలని అన్నారు. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల్లో తప్పేం ఉందని ఆయన అన్నారు.సినీ పరిశ్రమ గురించి నీచంగా మాట్లాడడం ప్రతి ఒక్కరికీ అలుసైపోయింది.ఇలా నీచంగా మాట్లాడటం సరికాదని తమ్మారెడ్డి అన్నారు. సినీ పరిశ్రమ  చాలా బాగుందని, నీచంగా ఉంటే .. మోహన్ బాబు కుమార్తె లక్ష్మీ ప్రసన్న, అలాగే నాగబాబు కుమార్తె, అక్కినేని నాగేశ్వరరావు మనవరాలు, రాజమౌళి కుటుంబంలోని మహిళలు ఎందుకు సినీ పరిశ్రమలోకి వస్తారని ప్రశ్నించారు. చెత్తగా ఉంటే హీరోయిన్లను ,హీరోలు ఎందుకు పెళ్లి చేసుకుంటారని అన్నారు. సినీ పరిశ్రమ బాగుంటేనే కదా ..హీరోయిన్లను హీరోలు పెళ్లి చేసుకుంటారని చెప్పారు. క్యాష్ కమిటీ  ఏర్పాటు చేస్తామని, త్వరలోనే పేర్లు ప్రకటిస్తామని చెప్పారు.