శరీర తాపాన్ని ఇలా వదలగొట్టండి!

ఎండకాలం వచ్చేసింది. ఎండలో తిరగితే శరీరం సహజరంగును కోల్పోయి, జీవం మాయమవుతుంది. చెమట, అతిదాహం వంటి మరెన్నో సమస్యలూ ఉంటాయి. వీటికి చెక్ పెట్టి,  చర్మంపై ట్యానింగ్ ను వదలగొట్టి, మిలమిలా మెరవాలంటే ఇలా చేసి చూడండి..

  1. బంగాళాదుంపలను బాగా ఉడ‌క‌బెట్టి చ‌ల్లార్చాలి. తర్వాత ఫ్రిజ్‌లో ఉంచి బాగా చ‌ల్ల‌గా అయ్యేలా చూడాలి. అనంత‌రం వాటిని న‌లిపి కమిలిన ప్ర‌దేశంలో రాయాలి. ఆలు పేస్ట్ నుంచి విడుద‌లయ్యే కాటెకొలాస్ ర‌సాయ‌నం చ‌ర్మాన్ని శుభ్రం చేస్తుంది. ట్యానింగ్ సుల‌భంగా త‌గ్గిపోతుంది.

 

  1. కొన్ని ఐస్ ముక్క‌ల‌ను తీసుకుని ట్యానింగ్ ప్రాంతంలో సున్నితంగా మ‌ర్ద‌న చేసిన‌ట్టు రాయాలి. చ‌ర్మం శుభ్రప‌డుతుంది.

 

  1. నారింజ పండు తొక్క‌ను తీసి లోప‌లి భాగంతో ముఖంపై రుద్దినా ట్యానింగ్ స‌మ‌స్య‌ను తొల‌గించుకోవ‌చ్చు.

 

  1. ప‌సుపు, గంధాలను స‌మ భాగాల్లో తీసుకుని ఆ మిశ్ర‌మానికి కొంత నీటిని, పెరుగును క‌లిపి పేస్ట్‌లా చేయాలి. ఈ పేస్ట్‌ను ఒంటికి రాసుకుని, ఆరిపోయక క‌డిగేయాలి.

 

  1. ముల్తానీ మ‌ట్టి, నీరు క‌లిపి ఫేస్‌ప్యాక్‌లా వేసుకున్నా ట్యానింగ్‌ను తొల‌గించుకోవ‌చ్చు. దీంతో చ‌ర్మం అందంగానే కాకుండా మృదువుగానూ మారుతుంది.
  1. తేనెలో యాంటీ బాక్టీరియ‌ల్ గుణాలు పుష్క‌లంగా ఉంటాయి. కొద్దిగా తేనెను తీసుకుని ముఖంపై రాసి కొంతసేపు ఆగాక గోరు వెచ్చ‌ని నీటితో క‌డిగేయాలి. దాంతో చ‌ర్మం మృదువుగా మారుతుంది.

 

  1. అలోవెరా జెల్‌ను రాసుకుని కొంత సేపు ఆగాక క‌డిగేయాలి. అలోవెరాలోని ఔష‌ధ గుణాలు ట్యానింగ్ స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మ‌నాన్ని క‌లిగిస్తాయి.

 

  1. ఒక కీర‌దోస‌కాయ‌ను తీసుకుని దాన్ని మెత్త‌ని పేస్ట్‌లా మిక్స్ చేసుకోవాలి. అనంత‌రం ఆ మిశ్ర‌మాన్ని స‌మ‌స్య ఉన్న ప్ర‌దేశంలో రాయాలి. అంతేకాదు చ‌ర్మం చ‌ల్ల‌ద‌నాన్ని పొంది కాంతివంత‌మ‌వుతుంది.

 

  1. ట్యానింగ్ త‌గ్గించ‌డంలో రోజ్ వాట‌ర్ కూడా బాగానే ప‌నిచేస్తుంది. కొద్దిగా నీటిని తీసుకుని అందులో 4,5 చుక్క‌ల రోజ్ వాట‌ర్‌ను క‌ల‌పాలి. ఆ మిశ్ర‌మంతో ముఖాన్ని క‌డిగేసుకోవాలి.

 

  1. కొబ్బ‌రినూనె, క‌ర్పూరాల‌ను క‌లిపి మిశ్ర‌మంగా త‌యారు చేయాలి. దాన్ని స‌మ‌స్య ఉన్న ప్ర‌దేశంపై రాస్తే ట్యానింగ్ త‌గ్గుతుంది. చ‌ర్మం మృదుత్వాన్ని పొందుతుంది.

 

  1. కొద్దిగా యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌ను తీసుకుని దాన్ని నీటిలో క‌ల‌పాలి. ఆ మిశ్ర‌మాన్ని రాస్తే ట్యానింగ్‌ను త‌గ్గించుకోవ‌చ్చు. ఈ టిప్ చాలా ఎఫెక్టివ్‌గా ప‌నిచేస్తుంది.

 

  1. చ‌ల్ల‌ని పెరుగును ట్యానింగ్ ఉన్న ప్ర‌దేశంలో రాస్తుంటే స‌మస్య త‌గ్గిపోతుంది. పెరుగులో ఉండే ప్రొ బయోటిక్, కాల్షియం, ప్రోటీన్‌, జింక్ త‌దిత‌ర మూల‌కాలు చ‌ర్మాన్ని సంర‌క్షిస్తాయి.

 

  1. కొద్దిగా బేకింగ్ సోడాను తీసుకుని నీటిలో క‌లిపి మిశ్ర‌మంగా చేయాలి. దాన్ని రాస్తుంటే ట్యానింగ్ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

 

  1. చ‌ల్ల‌ని పాల‌ను నేరుగా పూసుకున్నా ట్యానింగ్ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. దీంతో చ‌ర్మం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది.