అపచారం.. సింహాచలం గుడిలో తాంత్రిక పూజలు.. - MicTv.in - Telugu News
mictv telugu

అపచారం.. సింహాచలం గుడిలో తాంత్రిక పూజలు..

December 8, 2018

బెజవాడ దుర్గగుడిలో తాంత్రిక పూజల వ్యవహారం మరవకముందే.. విశాఖపట్నం సింహాచలంలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి అనుబంధ ఆలయంలో తాంత్రిక పూజలు కలకలం రేపుతున్నాయి. భైరవస్వామి గుడిలో పూజారులు గురువారం (అమావాస్య) అర్ధరాత్రి పూజలు చేసినట్లు తెెలుస్తోంది.  ఈవో ఆదేశాల మేరకు ఆలయ పూజార్లు క్షుద్రపూజలు నిర్వహించినట్లు స్థానికులు పేర్కొంటున్నారు.Telugu News Tantric worship at the Simhachalam Temple.. Poojaris And Temple EOఅర్ధరాత్రి ఆలయంలోని భైరవస్వామికి అర్చకులు అమావాస్య రోజు మద్యంతో అభిషేకం చేసి, పూజలు నిర్వహించారు. అయితే ప్రతీ అమావాస్యకు భక్తులు భైరవస్వామిని దర్శించుకుని పూజలు చేస్తారు. తెల్లవారు జామున ఆలయానికి భక్తులను ఆలయ సిబ్బంది లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. అదేంటి అని భక్తులు ప్రశ్నించగా.. ఈవో ఆదేశాలతో ఆలయంలో పూజలు జరుగుతున్నాయని, కొద్దిసేపు ఆగాలని సూచించారని భక్తులు పేర్కొన్నారు. దీనిపై ఈవోను సంప్రదించగా ఫలితం దక్కలేదు.