పటాకుల నిషేదంపై  బాబా రాందేవ్  బాంబులు   - MicTv.in - Telugu News
mictv telugu

పటాకుల నిషేదంపై  బాబా రాందేవ్  బాంబులు  

October 12, 2017

సుప్రీంకోర్టు ఢిల్లీలో పటాకులను బ్యాన్ చేసిన సందర్భంగా  సెలెబ్రిటీలు చాలా అనూహ్యంగా స్పందిస్తున్నారు.  మొన్నటికి మొన్న నవలా రచయిత చేతన్ భగత్ మండిపడ్డాడు. నిన్న జూహీచావ్లా లవ్యూ సుప్రీంకోర్టు అని స్పందించింది.  తాజాగా ఇవాళ బాబా రాందేవ్ స్పందించారు. ‘ ఒక సమాజాన్ని టార్గెట్ చెయ్యటం అస్సలు బాగాలేదు. ప్రత్యేకంగా హిందువుల పండగల మీదే ఎందుకిలా ఆంక్షలు విధిస్తున్నారో అర్థం కావడం లేదు. హిందూ పండుగలపై మాత్రమే నిషేధం విధించడం చాలా తప్పు ’ అని అన్నారు. ప్రతిదాన్ని న్యాయ దిశగా తీసుకెళ్లడం సరియైనదేనా ? అని ప్రశ్నించారు. తాను స్కూళ్లను, యూనివర్సిటీలను నడిపిస్తున్నానని, అక్కడ చేతితో పట్టుకుని కాల్చే బాణాసంచాలకు అనుమతి ఇచ్చినట్టు పేర్కొన్నారు. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ పరిధిలో పటాకులను అమ్మకూడదని సుప్రీంకోర్టు అక్టోబర్‌ 9న తీర్పు ఇచ్చింది. నవంబర్‌ 1 వరకు ఈ నిషేధం కొనసాగుతుందని పేర్కొంది.

ఈ విషయం ఇలా వుంటే.. పటాకుల నిషేధాన్ని సపోర్టు చేస్తూ, పటాకులు ప్రతి ఒక్కరిపై ప్రభావం చూపుతాయంటూ శశి థరూర్‌ ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌పై రాందేవ్‌ బాబా స్పందించారు. ఒక హిందువు అయి వుండి ఆయన ఇలా మాట్లాడటం చాలా సిగ్గుచేటుగా వుంది. పెద్ద పెద్ద టపాసుల బ్యాన్ అయితే ఓకే.. కానీ చిన్నగా శబ్దాలొచ్చే టపాసులను ఎందుకు బ్యాన్ చెయ్యవలసి వచ్చిందో అర్థం కావడం లేదని  రాందేవ్ మండి పడ్డారు.