పేరుకే స్పా.. అక్కడ జరిగేదంతా అదే.. - MicTv.in - Telugu News
mictv telugu

పేరుకే స్పా.. అక్కడ జరిగేదంతా అదే..

October 5, 2018

మసాజ్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. బంజారాహిల్స్‌లోని ఓ స్పాలో మసాజ్ పేరుతో వ్యభిచారం జరుగుతోందని సమాచారం అందడంతో వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. ఆరుగురు విటులు, పందొమ్మిదేళ్ల వయసున్న ముగ్గురు యువతులను అదుపులోకి తీసుకున్నారు.

Task Force Police Busted Prostitution Racket At Spa Banjara Hills

బంజారాహిల్స్‌ రోడ్ నెం.12లో హైలైన్ కాంప్లెక్స్ రెండో అంతస్తులో స్టూడియో మేకర్స్ స్పా‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం రాత్రి దాడులు చేశారు. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ విటులు, యువతులను అదుపులోకి తీసుకున్నారు. స్పా నిర్వాహకుడు కే.ఎం. సంతోష్, హేమంత్‌, చైతన్య, గణేశ్, మణికంఠన్ తదితరులను అరెస్ట్ చేశారు. వివిధ రాష్ట్రాల నుంచి అమ్మాయిలను తీసుకొస్తూ నిర్వాహకులు ఈ దందా సాగిస్తున్నట్లు గుర్తించారు. పట్టుబడ్డ నలుగురు యువతులను పునరావాస కేంద్రానికి తరలించారు.