మోదీ ప్రభుత్వంపై టిడిపి అవిశ్వాసం - MicTv.in - Telugu News
mictv telugu

మోదీ ప్రభుత్వంపై టిడిపి అవిశ్వాసం

March 16, 2018

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాలని తెలుగుదేశం పార్టీ చీఫ్ చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్డీఎతో తెగదెంపులు చేసుకోవాలని పోలిట్‌బ్యూరో సమావేశంలో నిర్ణయించుకున్నారు. ఎన్డీఎలో ఉంటూ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాలనే నిర్ణయంపై జాతీయ స్థాయిలో ప్రచారంలోకి తేవాలని ఆయన సూచించారు.ఎన్డీఎ నుంచి తప్పుకుంటున్నట్లు చంద్రబాబు బిజెపి అధ్యక్షుడు అమిత్‌షాకు లేఖ రాశారు. తాము ఎన్డీఎ నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకోవడానికి దారి తీసిన పరిస్థితులపై ఆయన లేఖలో వివరించినట్లు సమాచారం.