టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకుంటేనే టీడీపీకి భవిష్యత్తు ! - MicTv.in - Telugu News
mictv telugu

టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకుంటేనే టీడీపీకి భవిష్యత్తు !

March 2, 2018

రాజకీయం అంటే అవుతల పార్టీలపై దుమ్మెత్తి పోయాలి,  అవతసరమైతే  మీరు మేమూ  చిరకాల దోస్తులం అని  అలింగనం చేసుకోవాలి.  వెన్ను పోటు పొడవాలి, బట్ట కాల్చి మీదెయ్యాలి. ఇవన్ని  నేర్చుకుంటేనే  రాజకీయాల్లో మన సత్తా చాటుకుంటాం, పార్టీని ముందుకు తీసుకుపోతాం. లేకపోతే పాతాళానికి పడిపోతాం. ఇదే  సూత్రాన్ని  వొంట పట్టించుకున్నారు కావచ్చు  టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు.. అందుకే  2019 ఎన్నికల్లో  ఒకవేళ టీడీపీ ఏదైనా పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సి వస్తే అది టీఆర్ఎస్ తోనే  అని స్పష్టం చేశారు.

‘టీఆర్ఎస్ పార్టీతోె పొత్తు పెట్టుకుంటే  టీడీపీ  కార్యకర్తలకు మనోధైర్యం వస్తుంది.  ఎన్టీఆర్ ఆశీర్వాదం పొందిన వారే ఈరోజు  టీఆర్ఎస్ లో గొప్ప పదవుల్లో ఉన్నారు. అందుకే టీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకుంటేనే ఎన్టీఆర్ కి గౌరవం. లేకపోతే  టీడీపి తెలంగాణలో కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటికే  తెలంగాణలో  టిడిపి చాలా ఇబ్బందుల్లో ఉంది.  పార్టీకోసం చంద్రబాబు  తెలంగాణలో పర్యటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.   మళ్లీ  టీడీపీకి  పూర్వవైభవం రావాలంటే టీఆర్ఎస్‌తో  పొత్తు పెట్టుకోవాల్సిందే ’ అని ఆయన స్పష్టం చేశారు.