mictv telugu

మోదీ అడవి సింహం.. టీడీపీ నాయకులు గ్రామసింహాలు.. కన్నా

February 11, 2019

తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు, టీడీపీ పార్టీ ఇతర నేతలపై బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈరోజు గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు, ఆయన పార్టీ కార్యకర్తలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా గుంటూరులో జరిగిన ప్రధాని నరేంద్ర మోదీ సభ సక్సెస్ అయిందన్నారు. ఇది జీర్ణించుకోలేని టీడీపీ పార్టీ నాయకులు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. తమ ప్రధాని అడవి సింహమైతే, టీడీపీ నాయకులు గ్రామ సింహాలని ఘాటుగా విమర్శించారు.చంద్రబాబు నాయుడు మతిస్థిమితం లేకుండా మోదీ భార్యపైనా విమర్శలు చేయడం దారుణమన్నారు. అవినీతికి ప్పాడుతున్నారు కావునే చంద్రబాబు, లోకేష్ లపై మోదీ విమర్శలు చేశారన్నారు. ఎయిమ్స్‌, ఎయిర్‌పోర్ట్సు, జాతీయ రహదారి అభివృద్ధి పనుల్లో తండ్రీకొడుకులు కమీషన్లు తీసుకున్నది నిజంకాదా అని ప్రశ్నించారు. రాష్ట్రానికి కేంద్రం ఏం చేసిందో బీజేపీ చెబుతుంటే ప్రజలు నమ్ముతున్నారని, ఏమీ చేయలేదని చంద్రబాబు చెబుతున్నా నమ్మడం లేదని, అదే బాబులో అసహనాన్ని పెంచుతోందని వ్యాఖ్యానించారు.