14 నుంచి 12 స్థానాలకే పరిమితమైన సైకిల్… ఇబ్రహీంపట్నం బీఎస్పీకే…

సీట్ల సర్దుబాట్ల విషయంలో మహాకూటమిలో భాగం అయిన పార్టీలు త్యాగాలకు దిగుతున్నాయి. పార్టీల్లో సీట్లు రాని అభ్యర్థుల అలకలు చూసి వారిని ఓదార్చే క్రమంలో ఓ పార్టీ సీటు కేటాయించాలనుకుంటే.. ఇంకొక పార్టీ త్యాగం చెయ్యాల్సి వస్తోంది. ఈ క్రమంలో మహాకూటమిలో భాగస్వామ్యమైన టీటీడీపీ త్యాగానికి సిద్ధపడిందా అంటే అవుననే చెప్పాల్సి వస్తోంది. తొలుత 14 సీట్లలో పోటీకి సిద్ధమై, ఆపై మరో సీటును వదులుకున్న సంగతి తెలిసిందే. ఇబ్రహీంపట్నం నుంచి టీడీపీ అభ్యర్థి సామ రంగారెడ్డి పోటీ చేస్తారని భావించారు. కానీ చివరి క్షణంలో టీడీపీ తన నిర్ణయం మార్చుకుంది. ఆ స్థానాన్ని బీఎస్పీకి ఇచ్చేసింది. బీఎస్పీ తరఫున నిలబడిన మల్ రెడ్డి రంగారెడ్డికి మద్దతివ్వాలని మహాకూటమి నిర్ణయించింది. దీంతో టీడీపీ మరో స్థానాన్ని కోల్పోయింది. దీంతో టీడీపీ 12 సీట్లకే పరిమితమైంది.Telugu news TDP limited to 14 to 12 positions ... Ebrahimpatnam is BSP …తొలుత నుంచి ఈ స్థానంపై టీడీపీ విముఖత చూపుతోంది. బీఎస్పీ అభ్యర్థి మల్ రెడ్డి రంగారెడ్డితో పోటీ పడితే ఓటమి తప్పదని భావించారు, ఆ స్థానం నుంచి టీడీపీ తరఫున వున్న సామ రంగారెడ్డి. కొన్ని చర్చల అనంతరం తాను ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు చెప్పేశారు. దీంతో ఇబ్రహీంపట్నంలో బరిలో ఉన్న మల్ రెడ్డి సోదరుల్లో ఒకరికి మద్దతు పలకాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. సామ రంగారెడ్డి నేడు తన నామినేషన్‌ను ఉపసంహరించుకోనున్నారు.