mictv telugu

టీడీపీకి ఎమ్మెల్యే ఆమంచి రాజీనామా

February 13, 2019

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీల్లో చేరికలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. టీడీపీ పార్టీకి చెందిన చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధినేత చంద్రబాబుకు లేఖ రాశారు. పార్టీకి సంబంధం లేని కొన్ని శక్తుల ప్రమేయాన్ని వ్యతిరేకిస్తూ తాను రాజీనామా చేస్తున్నట్లు లేఖలో తెలిపారు. గురువారం వైసీపీలో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు ఆయన ఇప్పటికే హైదరాబాద్‌ చేరుకుని జగన్‌ను కలిశారు.

Telugu News tdp mla amanchi krishna mohan resign to party

ఈ నేపథ్యంలో చీరాల వెళ్లి పరిస్థితిని సమీక్షించాలని సీనియర్‌ నేత కరణం బలరామ్‌ను పార్టీ అధిష్ఠానం ఆదేశించింది. దీంతో స్థానిక నేతలతో ఆయన సమావేశం కానున్నారు. చీరాల నుంచి ఆమంచి కృష్ణమోహన్‌ నవతరం పార్టీ తరఫున గత ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. తరువాత టీడీపీ పార్టీలో చేరారు. గత కొద్ది రోజులుగా ఆయన పార్టీ మారనున్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీలో తగిన గుర్తింపు లేదని పలువురి వద్ద వ్యాఖ్యానించడం దీనికి బలం చేకూర్చింది. పార్టీ అధినేత చంద్రబాబుతో కూడా ఆయన సమావేశమయ్యారు.Telugu News tdp mla amanchi krishna mohan resign to party