mictv telugu

నా కుమారుడు జగన్ దారితప్పి తిరుగుతున్నాడు.. తెలుగు తల్లి

February 11, 2019

ఢిల్లీలో జరుగుతోన్న ధర్మపోరాట దీక్షలో టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామినీ శర్మ, తెలుగుతల్లి వేషధారణలో అందరి దృష్టినీ ఆకర్షించారు. “నా తల్లి భరత మాత సాక్షిగా నా రాష్ట్ర బిడ్డలకు అన్యాయం చేస్తున్న కేంద్రం” అని రాసున్న ప్లకార్డును పట్టుకుని వేదికపై యామిని తిరుగుతూ పలువురి అభినందనలు అందుకున్నారు. ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ, తన ఓ కుమారుడు చంద్రబాబు రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై మోదీని నిలదీస్తూ, అలుపెరగని పోరాటం చేస్తుంటే, మరో కుమారుడు జగన్ అదే మోదీకి మద్దతిస్తూ, ప్రజలకు అన్యాయం చేస్తున్నాడని ఆరోపించారు.Telugu News tdp spokesperson sadineni yamini in telugu talli getup at delhi dharma porata deekshaతన కుమారుడు జగన్ దారితప్పి తిరుగుతున్నాడని, అతన్ని దారిలోకి తెచ్చే బాధ్యత ప్రజలదేనని అన్నారు. దీక్షకు వచ్చిన వారితో ఏపీ భవన్ నిండిపోవడంతో, పక్కనే ఉన్న కేరళ హౌస్ లోనూ వందల మందికి ఆశ్రయం కల్పించారు. యామినీ శర్మ కూడా కేరళ హౌస్ లో బసచేసి, అక్కడి నుంచి తెలుగుతల్లి వేషంలో రోడ్డుపై నడుస్తూ వేదిక వద్దకు వచ్చారు.