మోహన్‌బాబు స్కూల్‌పై టీచర్ న్యాయపోరాటం - MicTv.in - Telugu News
mictv telugu

మోహన్‌బాబు స్కూల్‌పై టీచర్ న్యాయపోరాటం

February 8, 2018

పొడవు చేతుల చొక్కా, ఫార్మల్ ప్యాంట్ వేసుకుని స్కూల్‌కు వచ్చిందన్న కారణంతో రాణిరవడ (43) అనే టీచర్‌ను శ్రీ విద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం ఉద్యోగం నుంచి  తొలగించింది. గత డిసెంబర్ 7న ఈమేరకు ఉత్తర్వులను ఇచ్చింది. నటుడు మోహన్ బాబుకు చెందిన ఈ స్కూల్‌పై రాణిరవడ న్యాయ పోరాటానికి దిగింది. కేవలం తన దుస్తులను కారణంగా చూపించి తనను ఇలా సస్పెండ్ చేయడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేస్తోంది.అయితే శ్రీ విద్యానికేతన్ నియామవళికి విరుద్దంగా రాణిరవణ టీచర్ క్లాజ్ 11, 13లను ఉల్లంఘించిందని సకాలంలో సిలబస్ కూడా పూర్తి చేయలేదని యాజమాన్యం ఆరోపించింది. స్కూల్ ప్రమాణాలకు విరుద్దంగా వస్త్రధారణ ఉండటం వల్లే ఆమెను తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.

అయితే రాణిరవణ ఈ వాదనను తోసిపుచ్చింది. ‘నాతోపాటు మరో టీచర్ కూడా అలాంటి దుస్తులే వేసుకొస్తున్నా.. ఆమె మీద చర్యలు తీసుకోలేదు. కావాలని నన్ను మాత్రమే స్కూల్ నుంచి తప్పించారు. కేవలం నేను తెలుగు వ్యక్తిని అయినందువల్లే నన్ను తొలగించారు. సిలబస్ పూర్తి చేయలేదన్న ఆరోపణలు నన్ను తొలగించడం కోసం సృష్టించిన తప్పుడు కథనాలు. నా ప్రవర్తన నచ్చకపోతే లిఖిత పూర్వకంగా ఆదేశాలు ఇవ్వాల్సింది. అలా చెయ్యకుండా అమర్యాదకరంగా నన్నుహఠాత్తుగా విధుల నుంచి తొలగించారు. ఉద్యోగాన్నే నమ్ముకొని బతుకుతున్న నేనేం కావాలి? ’ అని పేర్కొన్నారు. యాజమాన్యం నన్ను మళ్ళీ ఉద్యోగంలో చేర్చుకునేవరకు న్యాయపోరాటం చేస్తానంటోంది.