పిల్లగాడి మూతికి ప్లాస్టర్ వేసిన టీచర్ కొత్తరకం శిక్షనట - MicTv.in - Telugu News
mictv telugu

పిల్లగాడి మూతికి ప్లాస్టర్ వేసిన టీచర్ కొత్తరకం శిక్షనట

November 25, 2017

 

పిల్లలను స్కూళ్ళకు పంపాలంటే తల్లిదండ్రులు భయపడాల్సిన పరిస్థితులు దాపురించాయి. పాఠాలను ప్రేమతో చెప్పాల్సిన టీచర్లు అదిరిస్తూ, బెదిరిస్తూ, పిల్లలకు చిన్న చిన్న శిక్షలు వేస్తున్నారు. కొందరు టీచర్లు పిల్లల్ని దండించడంలో కొత్త కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు.

మనకు తెలిసిన శిక్షల్లో గోడకుర్చీ, బెంచీ మీద ఎక్కించడం, గుంజీలు తీయించడం, కోడిపుంజు వేయించడం, మోకాళ్ళ మీద కూర్చోబెట్టడం మనకు తెలుసు. అయితే ఈ టీచరమ్మ కొత్త శిక్షలు కనుక్కున్నది. క్లాసులో ఎక్కువగా మాట్లాడే పిల్లలకు ఊపిరాడకుండా నోటికి ప్లాస్టర్ వేసి వాళ్ళల్లో మార్పు తేవాలనుకుంటున్నది.

ఆ టీచరమ్మ పేరు అస్రా. పని చేస్తున్నది సీజన్స్ స్ట్రీట్ స్కూల్, పుప్పాల గూడ. ఈ టీచరమ్మ చేతిలో శిక్షకు గురైంది యూకేజీ చదువుతున్న ఐదేళ్ళ బాబు. ఈ అబ్బాయి తల్లిదండ్రుల పేర్లు జె. సౌజన్య, ఆనంద్ రంగా. అయితే క్లాసులో ఏం జరిగిందన్న విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు తొలుత స్కూలు ప్రిన్సిపాల్‌కు కంప్లైంట్ చేశారు.

కానీ ఆ ప్రిన్సిపాల్ పట్టించుకోలేదు. దీంతో వారు పోలీస్ స్టేషన్‌లో సెక్షన్ 82 జూనియర్ అండ్ జస్టిస్ ( కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆక్ట్ 2015 ) ప్రకారంగా కేసు పెట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.