టీచర్ కొలువుల పరీక్షలు  ఈనెలలోనే ! - MicTv.in - Telugu News
mictv telugu

టీచర్ కొలువుల పరీక్షలు  ఈనెలలోనే !

February 1, 2018

తెలంగాణ కొలువుల జాతర షురువైంది.  టీచర్ల నియామకాల పరీక్ష షెడ్యూల్ ను టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. ఈనెల 24 తేదీ నుండి మార్చి 4వ తేదీ వరకు ఈపరీక్షలు జరగనున్నాయి. అయితే  ఈపరీక్షలు  కాబోయే టీచర్లు  ఆన్‌లైన్’లో రాయాల్సి ఉంటుంది. ఈవిషయాన్ని  టీఎస్‌పీఎస్సీ అధికారులు ప్రకటించారు.

పరీక్ష నిర్వహించు తేదీలు

* ఫిబ్రవరి 24న స్కూల్‌ అసిస్టెంట్‌, భాషా పండింట్‌, తెలుగు పరీక్ష 
* ఫిబ్రవరి 25న ఎస్జీటీ తెలుగు, ఇంగ్లీష్ 
* ఫిబ్రవరి 26న స్కూల్‌ అసిస్టెంట్‌ ఇంగ్లీష్, గణితం, సాంఘిక శాస్త్రం 
* ఫిబ్రవరి 27న స్కూల్‌ అసిస్టెంట్‌ సామాన్య శాస్త్రం, స్కూల్‌ అసిస్టెంట్‌ భాషా పండిట్‌ అభ్యర్థులకు ఉర్దూ, మరాఠీ, హిందీ పరీక్షలు 
* ఫిబ్రవరి 28న స్కూల్‌ అసిస్టెంట్‌ – హిందీ, కన్నడ, తమిళం, ఉర్దూ పరీక్షలు 
* ఫిబ్రవరి 28న పీఈటీ తెలుగు, ఉర్దూ, కన్నడ, మరాఠీ, హిందీ 
* మార్చి 2న తెలుగు, హిందీ, ఉర్దూ, బెంగాళీ, కన్నడ, మరాఠీ పరీక్షలు 
అదే రోజు స్కూల్‌ అసిస్టెంట్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ పరీక్ష 
* మార్చి 3న స్కూల్‌ అసిస్టెంట్‌ జీవ శాస్త్రం, గణితం, సాంఘిక శాస్త్రంతో పాటు ఆంగ్ల మాధ్యమంలో భౌతిక శాస్త్రం పరీక్ష జరగనుంది. 
* మార్చి 4న స్కూల్‌ అసిస్టెంట్‌ గణితం, జీవశాస్త్రం, సాంఘిక శాస్త్రం పరీక్షతో పాటు పీఈటీలకు ఆంగ్ల మాధ్యమం పరీక్ష జరగనుంది.

మరింకే  పరీక్షలకు దాదాపు  ఇంకా ఇరవై ఐదు రోజుల సమయం ఉంది కాబట్టి పుస్తకాలతో  కుస్తీ పట్టడం మొదలు పెట్టండి  ఆల్‌‌దిబెస్ట్