పిల్లలపై టీచర్ థర్డ్ డిగ్రీ!

మా పిల్లలకు మంచి మంచి ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివిస్తున్నామని తల్లిదండ్రులు బీరాలుపోతూ చెబుతుంటారు. కానీ ఈ వీడియో చూశాక చాలా మందికి ఆ కళ్ళకు కమ్మిన మసకలు  తొలగిపోవడం ఖాయం.

హరియాణాలోని రేవాడీలో ఉన్న యూరో ఇంటర్నేషనల్ స్కోల్లో ఒక టీచర్ పిల్లలను అత్యంత పాశవికంగా దండిస్తున్న వీడియో ఇది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇద్దరు పిల్లలను తరగతి గదిలో కూర్చోబెట్టి ఒకబ్బాయిని బూటుతో ఇష్టమొచ్చినట్టుగా కొట్టాడు గురుడు. తర్వాత ఇంకొక అబ్బాయిని చేత్తో ఛడామడా చెంపలు వాచేలా, తల గిర్రున తిరిగేలా హింసించాడు.

హరియాణా  ప్రభుత్వం వెంటనే ఈ దుష్ట టీచర్ మీద చర్యలు తీసుకోవాలని నెటిజనులు డిమాండ్ చేస్తున్నారు. ఇలా టీచర్లు పిల్లల మీదకు నిర్దయగా తెగబడటం వల్లే పిల్లలు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని తాజా సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఇంతటి అవమానాన్ని భరించకే సెన్సిటివ్‌గా పిల్లలు బలవన్మరణాలకు తెగబడుతుంటారు. తప్పులు చెయ్యటం పిల్లల సహజ లక్షణం. అలాగని వాళ్ళని ఇంత దారుణంగా కొడతారా ? మంచి ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళల్లో చదివిస్తున్నామని చెప్పుకునే తల్లిదండ్రులూ కాస్త ఆలోచించాల్సిన తరుణమిది.

SHARE